Cancer Diet: కేన్సర్‌ను సైతం వణికించి దరిచేరకుండా చేసే ఆహార పదార్ధాలు ఇవే

Cancer Diet: శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా ఇప్పటికీ సరైన చికిత్స లేని రోగాలు చాలా ఉన్నాయి. అందులో అత్యంత ప్రమాదకరమైంది కేన్సర్. కేన్సర్ సోకిందంటే మరణమే శరణ్యమయ్యే పరిస్థితి ఉంది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటో చూద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 17, 2024, 07:32 PM IST
Cancer Diet: కేన్సర్‌ను సైతం వణికించి దరిచేరకుండా చేసే ఆహార పదార్ధాలు ఇవే

Cancer Diet: ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు గుండెపోటుతో మరణిస్తుంటే..రెండవ స్థానంలో ఉన్నది కేన్సర్ రోగులు. అంత ప్రమాదకరమైంది. ఇప్పటికీ సరైన లేదా కచ్చితమైన చికిత్స లేదు. అందుబాటులో ఉన్న చికిత్సలన్నీ కేన్సర్ తీవ్రత తగ్గించేందుకే దోహదపడతాయి. అందుకే కేన్సర్ అంటే భయపడే పరిస్థితి నెలకొంటోంది. 

వాస్తవానికి కేన్సర్ అనేది కొత్తగా వచ్చిన వ్యాధి కానేకాదు. ఎప్పట్నించో అనాదిగా ఉన్నదే. ఈ మధ్యకాలంలో కేన్సర్ రోగం ఎక్కువైంది. గతంలో అంటే పాతకాలంలో అప్పటి ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాల కారణంగా కేన్సర్ దరిచేరేది కాదు. ఎందుకంటే సరైన ఆహారం ఉంటే ఏ వ్యాధినైనా నిలువరించవచ్చు లేదా నివారించవచ్చు. డైట్ సరిగ్గా ఉండే చాలా రకాల అనారోగ్య సమస్యలు దరిచేరవు. కేన్సర్ అందుకు మినహాయింపు కానే కాదు. కొన్ని రకాల ఆహార పదార్ధాలు డైట్‌లో ఉంటే కేన్సర్ మీకు దరిదాపుల్లో రాదు. 

ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం.  ఇందులో బచ్చలి కూర, కాలే, తోటకూర, చుక్క కూర వంటివాటిలో ఉండే సహజ విటమిన్లు, ఖనిజాలు చాలా మేలు చేకూరుస్తాయి. వీటిలో ఉండే గ్లూకోసినోలేట్స్ అనే సమ్మేళనాలు కేన్సర్ రక్షణలో అద్భుతంగా ఉపయోగపడతాయి. అందుకే ఆకుకూరల్ని డైట్‌లో చేర్చుకుంటే కేన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుంది.

టొమాటోలో ఉండే లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ప్రోస్టేట్, లంగ్స్, కడుపు కేన్సర్ ముప్పు తగ్గుతుంది. కేన్సర్ నుంచి సురక్షితంగా ఉండాలంటే రోజుకు క టొమాటో అయినా తినాలంటారు వైద్యులు. 

బ్రోకలీలో మనిషి ఆరోగ్యానికి కావల్సిన పోషక పదార్ధాలు చాలా ఎక్కువగా ఉంటాయి. శీతాకాలంలో విరివిగా లభించే బ్రోకలీలో కేన్సర్ కణాలు పెరుగుదలను అడ్డుకునే పోషకాలుంటాయి. ఇందులో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు కూడా అధికం. 

వెల్లుల్లి అనేది ఇడియన్ కిచెన్‌లో తప్పకుండా కన్పించే వస్తువు. ఇందులో ఉండే పోషకాలు ముఖ్యంగా ఎలిసిన్ అనేది కేన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటుంది. ఇందులో ఉండే సల్ఫర్ సమ్మేళణాలు. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 

బెర్రీలు ఆరోగ్యానికి చాలా మంచిది. బెర్రీల్లో చాలా రకాలు స్ట్రా బెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ బెర్రీలుంటాయి. ఇందులో అత్యధిక మోతాదులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేందుకు తోడ్పాటు లభిస్తుంది. 

పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే పోషకం కేన్సర్ కణాలు ఎదుగుదలను అడ్డుకుంటుంది. భారతీయులు ప్రతి  వంటలో  తప్పకుండా పసుపు వినియోగిస్తుంటారు. పసుపు ఎక్కువగా తీసుకుంటే భవిష్యత్తులో కేన్సర్ ముప్పు తగ్గుతుంది. 

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ. కేన్సర్‌ను ప్రేరేపించే ఫ్రీ రాడికల్స్ నుంచి శీరీరాన్ని రక్షిస్తాయి. ఇందులో కూడా ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే సామర్ధ్యం కలిగిన పోషకాలుంటాయి. భవిష్యత్తులో కేన్సర్ రాకుండా చూసుకోవాలంటే ఈ ఆహారపదార్ధాలు తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి.

Also read: Home Loan Closing Rules: మీ హోమ్ లోన్ క్లోజ్ చేస్తున్నారా, ఈ అంశాలు తప్పకుండా గుర్తుంచుకోవల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News