Cholesterol Tips: కొలెస్ట్రాల్ సమస్యకు సూపర్ చిట్కా, వేడి నీళ్లతో పరిష్కారం

Cholesterol Tips: ఆధునిక జీవన విధానంలో ప్రతి ఒక్కరూ చాలా రకాల వ్యాధులు ఎదుర్కొంటున్నారు. ఇందులో కొన్ని వ్యాధులు ప్రమాదకరమైనవి కూడా. అయితే ఎంతటి ప్రమాదకర వ్యాధి అయినా దినచర్య సరిగ్గా ఉంటే..ఆహారపు అలవాట్లు బాగుంటే ఏ సమస్యా రాదంటున్నారు..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 15, 2023, 02:20 PM IST
Cholesterol Tips: కొలెస్ట్రాల్ సమస్యకు సూపర్ చిట్కా, వేడి నీళ్లతో పరిష్కారం

Cholesterol Tips: వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అందులో ముఖ్యమైంది కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ ఒక్కటే ఇతర వ్యాధులకు కారణమౌతుంటుంది. అందుకే లైఫ్‌స్టైల్ మార్చాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. కొన్ని చిట్కాలు పాటించాలి.

ఆరోగ్యవంతమైన జీవితానికి కావల్సింది ప్రధానంగా రెండే రెండు. ఒకటి జీవన విధానం అంటే లైఫ్‌స్టైల్ సరిగ్గా ఉండటం, రెండవది ఆహారపు అలవాట్లు. ఈ రెండింట్లో ఏది బ్యాలెన్స్ తప్పినా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడటం ఖాయం. ముఖ్యంగా సమయానికి నిద్రించకపోవడం, తినకపోవడంతో పాటు జంక్‌ఫుడ్స్, ఫాస్ట్‌ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య వెంటాడుతుంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతుంది. వాస్తవానికి కొలెస్ట్రాల్ శరీరానికి అవసరమే కానీ పరిమితి మించకూడదు. పరిమితి దాటితే ఇది ప్రమాదకరమౌతుంది. అయితే ఇంత ప్రమాదకరమైన కొలెస్ట్రాల్‌ను అత్యంత సులభంగా కేవలం వేడి నీళ్లతో నియంత్రించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం హై కొలెస్ట్రాల్‌కు వేడి నీళ్లు మంచి పరిష్కారమంటున్నారు. గోరు వెచ్చని నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిదే. చాలా రకాల అనారోగ్య సమస్యల్నించి ఉపశమనం కల్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. బ్లడ్ వెస్సెల్స్‌ను శుభ్రపరుస్తాయి. రోజూ గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీరం డీటాక్స్ అవుతుంది.అంటే శరీరంలో ఉండే విష పదార్ధాలు చాలా సులభంగా బయటకు వచ్చేస్తాయి. అనారోగ్యకరమైన ఆహార పదార్ధాలు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. బ్లడ్ వెస్సెల్స్‌కు లిపిడ్స్ అంటుకుపోయుంటాయి. వేడి నీళ్లు తాగినప్పుడు ఇవి తొలగిపోతాయి. రోజూ వేడి నీళ్లు తాగే అలవాటుంటే కొలెస్ట్రాల్ సమస్య దరిచేరదని అంటారు.

రోజూ వేడి నీళ్లు తాగడం వల్ల రక్త నాళాలకు అంటుకుని ఉండే కొవ్వు కరిగిపోతుంది. ఫలితంగా రక్త నాళాలు శుభ్రమౌతాయి. వేడి నీళ్ల రక్త నాళాలకు అంటుకునే లిపిడ్స్‌ను దూరం చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌కు ప్రధాన కారణం ఆయిలీ ఫుడ్స్, ట్రై గ్లిసరాయిడ్స్. వేడి నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే కొలెస్ట్రాల్ సమస్య చాలా వరకూ తగ్గుతుంది. కొంతమందికి భోజనం తరువాత వేడి నీళ్లు తాగడం అలవాటు. ఇది చాలా మంచి అలవాటు. కొలెస్ట్రాల్‌ను శరీరంలో పేరుకోనివ్వదు. వేడి నీళ్లు శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి.

కొలెస్ట్రాల్ సమస్య ఉంటే రోజూ పరగడుపున వేడి నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపితే ఇంకా మంచిది. శరీరంలో టోటల్ కొలెస్ట్రాల్ స్థాయి 200-239 మధ్యలో ఉండాలి. హెచ్‌డీఎల్ 60 కంటే ఎక్కువ ఉండాలి. ఎల్‌డీఎల్ 100 కంటే తక్కువ ఉండాలి. 

Also read: Walking Benfits: మీకెవ్వరికీ తెలియని టాప్ 10 వాకింగ్ ప్రయోజనాలు, తెలిస్తే ఆశ్చర్యపోతారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitte , Facebook

Trending News