Metabolism Tips: ఆధునిక జీవన విధానంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అయితే ప్రతి సమస్యకు ఆసుపత్రుల చుట్టూ పరుగెట్టాల్సిన అవసరం లేదు. వంటింట్లో లభించే అద్భుతమైన ఔషధాలతోనే చాలా రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణం మాత్రం ఒక్కటే. శరీరంలో మెటబోలిజం సరిగ్గా లేకపోవడం. అంటే జీవక్రియ మందగిస్తేనే వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయి. మెటబోలిజంకు అంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంటుంది.
శరీర నిర్మాణంలో కీలకపాత్ర పోషించే మెటబోలిజం సరిగ్గా లేకపోతే..జీర్ణ సమస్యలతో పాటు ఇతర చాలా సమస్యలు ఒకదాని నుంచి మరొకటి వెంటాడుతాయి. అంతటి ప్రాముఖ్యత కలిగిన జీవక్రియను మెరుగుపర్చుకునే మార్గాలు కూడా ఉన్నాయి. అధ్భుతమైన చిట్కాలున్నాయి. అందులో ముఖ్యమైంది వాము నీళ్లు .
శరీరంలో జీవక్రియ లేదా మెటబాలిజం మందగించడం వల్ల అన్ని రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. స్థూలకాయం, డయాబెటిస్, మలబద్ధకం, కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు ఇలా అన్నింటికీ కారణమిదే. అయితే రోజూ వాము నీరు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఫలితంగా కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి చాలా రకాల సమస్యల్నించి ఉపశమనం లభిస్తుంది. మరోవైపు బరువు తగ్గించుకునేందుకు వాము నీరు అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలోని జీవక్రియను వాము నీరు వేగవంతం చేస్తుంది. అందుకే వాము నీళ్లతో ఒబెసిటీని సైతం నియంత్రించవచ్చంటున్నారు.
అయితే క్రమం తప్పకుండా ప్రతిరోజూ వాము నీరు తీసుకోవల్సి ఉంటుంది. ఒక చెంచా వాము గింజల్ని గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాల్సి ఉంటుంది. ఉదయం ఆ నీటీని మరిగించి..వడపోసి తాగాలి. రోజూ ఉదయం పరగడుపున వాము నీళ్లను సేవిస్తే మంచి ఫలితాలుంటాయి.
ఇక మహిళలకు సంబంధించి తరచూ పీరియడ్స్ సమయంలో భరించలేని కడుపు నొప్పి సర్వ సాధారణంగా కన్పిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవాళ్లు నీటిలో వామును బాగా మరగబెట్టి చల్లార్చి తీసుకోవాలి. ఫలితంగా కడుపు నొప్పి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. వాములో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలెక్కువ. ఇందులో పుష్కలంగా ఉండే ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, నికోటిన్ యాసిడ్, కార్పొహైడ్రేట్లు, డైటరీ ఫైబర్‌లు ఆరోగ్యానికి చాలా మంచిది. జీవక్రియ లేదా మెటబోలిజం ఆరోగ్యంపై అంతలా ప్రభావం చూపిస్తుంది. అందుకే జీవక్రియను మెరుగుపర్చుకుంటే ఏ సమస్యా ఉండదు.
Also read: Garlic Side Effects: వెల్లుల్లితో లాభాలే కాదు నష్టాలు కూడా, ఎవరెవరు తినకూడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook