Bone Health: మనిషి శరీర నిర్మాణంలో కీలకంగా ఉండేవి ఎముకలు. ఎముకలు ఆరోగ్యంగా ఉన్నంతవరకే మనిషి ఏ పనైనా చేయగలడు. అందుకే ఎముకలు ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవడం చాలా అవసరం. బోన్స్ ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదనే వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం.
కొన్ని రకాల ఆహారపు అలవాట్లు ఎముకలకు హాని కల్గిస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో కాల్షియం, విటమిన్ అధికంగా ఉండేట్లు చూసుకుంటే బోన్స్ పటిష్టంగా ఉంటాయి. ఎందుకంటే ఎముకల పటిష్టత, ఎదుగుదలలో ఈ రెండు పోషకాలు కీలక భూమిక వహిస్తాయి. అదే సమయంలో కొన్ని రకాల ఆహార పదార్ధాలు ఎముకల్ని బలహీనం చేస్తాయి. అందుకే ఎలాంటి ఆహారం తినకూడదనే ముందుగా తెలుసుకోవాలి.
స్వీట్స్ అనేవి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. షుగర్ స్వీట్స్ తినడం వల్ల ఎముకల ఆరోగ్యం ప్రభావితమౌతుంది. షుగర్ అధిక మోతాదులో ఉండే ఆహార పదార్ధాలు తినడం వల్ల ఎముకలు బలహీనమైపోతాయి. మరీ ముఖ్యంగా బోన్ డెన్సిటీ తగ్గుతుంది. ఆస్టియో పోరోసిస్ వ్యాధి గ్రస్థులైతే స్వీట్స్ మొత్తానికి దూరం పెట్టాలి. లేకపోతే ఎముకలు గుల్లైపోతాయి.
అదే సమయంలో కెఫీన్ కూడా సరైన మోతాదులోనే తీసుకోవాలి. పరిమితి మించితే తీవ్ర అనర్ధానికి దారితీస్తుంది. కెఫీన్ ఉండే పదార్ధాలు ఎముకల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఇక మరో ముఖ్యమైంది సోడియం. అంటే ఉప్పు. శరీరానికి ఉప్పు అవసరమే కానీ మోతాదు మించకూడదు. ఎక్కువ సాల్ట్ ఉండే పదార్ధాలు ఎముకలను దెబ్బతీస్తాయి. ఉప్పు ఎక్కువైతే శరీరంలో కాల్షియం పరిమాణం తగ్గిపోతుంది. దాంతో ఎముకలు బలహీనంగా మారతాయి. అందుకే ఉప్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఇక కార్బొనేటెడ్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకునే అలవాటుంటే మానుకోవల్సిందే. ఎందుకంటే ఈ అలవాటు మీ ఎముకల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే ఇందులో ఉండే యాసిడ్ రక్తంలో ఆమ్లస్థాయిని పెంచేస్తుంది. అంటే పీహెచ్ విలువను పెంచుతుంది. దాంతో ఎముకల్నించి కాల్షియం బయటికొచ్చి బోన్ డెన్సీటీ తగ్గించేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook