Weight Control: స్థూలకాయం లేదా అధిక బరువు మనిషి ఆరోగ్యానికి చాలా హానికరం. దీనివల్ల చాలారకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, డయాబెటిస్, గుండెపోటు వంటి సమస్యలతు తలెత్తుతాయి. ఇవి ప్రాణాంతకం కూడా. అందుకే బరువు విషయంలో ఎప్పటికప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి.
నిత్య జీవితంలో ఆహారపు అలవాట్లు జీవనశైలి పూర్తిగా మారిపోయింది. వేళ కాని వేళల్లో తిండి తినడమే కాకుండా నిద్ర సరిగ్గా లేకపోవడం, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తరచూ తినడం వంటివి నిస్సందేహంగా మనిషి బరువును పెంచుతున్నాయి. దీనికితోడు శారీరక వ్యాయామం లేదా వాకింగ్ లేకపోవడంతో స్థూలకాయం వచ్చేస్తోంది. ఫలితంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అధిక బరువు అనేది ప్రస్తుతం చిన్న పిల్లల్నించి పెద్దల వరకూ అందర్నీ వేధిస్తోంది. బయటి తిండికి అలవాటు పడిపోవడమే స్థూలకాయానికి ప్రధాన కారణం.
మనిషి శరీరానికి రోజుకు ఎన్ని కేలరీలు అవసరమో అంతకంటే ఎక్కువ తినడం వల్ల చాలా త్వరగా ఊబకాయం బారినపడుతున్నారు. సమయం లేక వ్యాయామానికి దూరమౌతున్నారు. దాంతో బరువు పెరిగిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో బరువు తగ్గించాలంటే ఏం చేయాలి, ఎలాంటి అలవాట్లు, తిండి ఉండాలనేది పరిశీలిద్దాం..
శరీరం ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలంటే అన్నింటికంటే ముఖ్యమైంది సరైన నిద్ర. రోజుకు 7-8 గంటల ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. నిద్ర తగినంతగా ఉంటే శరీరంలోని కండరాలకు పూర్తి స్థాయిలో విశ్రాంతి లభించి..తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమౌతుంది. జీవక్రియ వేగవంతం కావడం వల్ల స్థూలకాయం సమస్య దూరమౌతుంది. ప్రతిరోజూ కనీసం 20 నిమిషాలైనా వాకింగ్ కు కేటాయించాలి. మరీ ముఖ్యంగా మద్యాహ్నం, రాత్రి వేళ బోజనానంతరం కాస్సేపు లైట్ వాకింగ్ చాలా మంచిది.
ప్రతిరోజూ తాజా పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే కాకుండా శరీరం ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండేందుకు దోహదపడతాయి. పండ్లలో పెద్దమొత్తంలో ఉండే ఫైబర్ ఇందుకు ఉపయోగపడుతుంది. దీనికోసం యాపిల్, తృణ ధాన్యాలు, జామ, అరటి, బీన్స్ ఎక్కువగా తినాలి. మరోవైపు స్వీట్స్ లేదా చక్కెర పదార్ధాలకు పూర్తిగా దూరం పాటించాలి. చక్కెర శాతం తగ్గిస్తేనే శరీరంలో కొవ్వు కరుగుతుంది. ఈ చిట్కాలు క్రమం తప్పకుండా పాటిస్తే కేవలం 7-8 వారాల వ్యవధిలో బరువు తగ్గించుకోవచ్చు.
Also read: Sweet Potatoes For Diabetics: మధుమేహం ఉన్నవారు బంగాళదుంప తినడం మంచిదేనా? తింటే ఏం జరుగుతుందంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook