Ice Apple Benefits: ఐస్ యాపిల్ ఎప్పుడైనా తిన్నారా..ఆదే తాటి కళ్లు, ఆరోగ్యానికి ఎంత మంచిదంటే

Ice Apple Benefits: ప్రకృతి మనకు చాలా రకాల పదార్ధాలను అందిస్తుంటుంది. కొన్ని సీజనల్ అయితే మరి కొన్ని ఏడాది పొడుగునా లభిస్తాయి. ప్రకృతిలో లభించే పదార్ధాల్లో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తుంటాయి. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 26, 2023, 04:07 PM IST
Ice Apple Benefits: ఐస్ యాపిల్ ఎప్పుడైనా తిన్నారా..ఆదే తాటి కళ్లు, ఆరోగ్యానికి ఎంత మంచిదంటే

Ice Apple Benefits: దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకం చెట్లు, మొక్కలు ఉంటాయి. వీటితో లభించే పండ్లలో అద్భుతమైన పోషకాలుంటాయి. అందులో ఒకటి తాటి చెట్లు. ఇవి ఉత్తరాదిన బహుశా కన్పించకపోవచ్చు. దక్షిణాదిలో సమృద్ధిగా కన్పిస్తాయి. ఈ చెట్ల నుంచి వచ్చే ముంజల్లో ఉండేవే ఐస్ ఆపిల్స్ లేదా తాటి కళ్లు. 

ప్రతి ఏటా వేసవిలో తాటి కళ్లు లేదా ఐస్ యాపిల్ పుష్కలంగా లభిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే వీటికి కొదవే ఉండదు. ఐస్ ఆపిల్ ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. వీటితో ఆరోగ్యపరంగా అద్బుతమైన ప్రయోజనాలున్నాయి. తాటి ముంజలు లేదా తాటి కళ్లుగా పిల్చుకునే వీటిలో అద్బుతమైన పోషక పదార్ధాలున్నాయి. అందుకే ఆరోగ్యానికి చాలా మంచిది. మరీ ముఖ్యంగా వేసవిలో లభించే వీటిని రోజూ తినడం వల్ల శరీరం చలవ చేస్తుంది. ఇందులో ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్ ఎ, విటమిన్ కే వంటి పోషకాలు చాలా ఎక్కువ. మెరుగైన ఆరోగ్యం కావాలంటే తాటి కళ్లు  తినాల్సిందే. 

ఇవి పూర్తిగా వాటర్ కంటెంట్ కలిగినవి. ఇవి తినడం వల్ల శరీరంలో నీటి కొరత ఉంటే పోతుంది. దాంతోపాటు బలహీనంగా ఉండే రోగ నిరోధక శక్తిని పటిష్టం చేస్తుంది. ఐస్ ఆపిల్ కొద్దిగా కొబ్బరి నీళ్ల రుచి కలిగి ఉంటుంది. వేసవిలో మాత్రమే లభిస్తుంది. 

స్థూలకాయంతో బాధపడేవారికి, బరువు తగ్గించుకోవాలనే ఆలోచనతో ఉండేవారికి ఐస్ యాపిల్ చాలా మంచిది. బరువు తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. డైట్‌లో ఉండటం వల్ల ఎక్కువసేపు ఆకలి అనేది వేయదు. ఎందుకంటే ఇందులో ఉండే నీళ్లతో కడుపు నిండటమే కాకుండా ప్రోటీన్లు అందుతాయి. 

వేసవిలో సహజంగా డీ హ్రైడ్రేషన్ సమస్య ఉంటుంది. శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంటుంది. ఈ పరిస్థితుల్లో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం చాలా చాలా అవసరం. డీ హైడ్రేషన్ సమస్య నుంచి కాపాడుకోవాలంటే తాటి కళ్లు అద్భుతంగా ఉపయోగపడతాయి. శరీరానికి చలవ చేస్తుంది. 

రోగ నిరోధక శక్తిని పటిష్టం చేసేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. వివిధ రకాల వ్యాధుల్నించి రక్షించుకునేందుకు రోగ నిరోధక శక్తి చాలా అవసరం. తాటి కళ్లు తినడం వల్ల ఇమ్యూనిటీ అద్భుతంగా మెరుగుపడుతుంది. ఇవి విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటాయి. 

Also read: Mosquito Coils: మస్కిటో కాయిల్ నుంచి వచ్చే పొగ సిగరెట్ల పొగ కంటే హానికరం..ఎందుకో తెలుసా?

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News