Do Not Overdose Almonds: బాదం అనేది అత్యంత విటమిన్స్ కలిగిన ఓ డ్రై ఫ్రూట్. ఇది శరీరానికి ఎంతో మేలు కలిగించే పోషక విలువలను అందిస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు దీనిని ఎంతో మక్కువతో తింటారు. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి మంచి లాభాలు చేకురుస్తాయి కనుక దీనిని తినమని వైద్యులు సిఫార్సు చేస్తారు. బాదంపప్పు తింటే మెదడు చురుకుతో పని చేయడమే కాకుండా.. జ్ఞాపకశక్తి మెరుగవుతుందని చెబుతున్నారు. ఈ ప్రయోజనాలను తెలుసుకున్న చాలా మంది బాదంను అవసరానికి మించి తీసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు సమస్యలకు దారి తీస్తోంది. బాదంపప్పు వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం పప్పులు ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు:
1. కిడ్నీలో స్టోన్:
బాదంపప్పును ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కిడ్నీలో సమస్యలు వచ్చే అవకశాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రై ఫ్రూట్‌లో ఆక్సలేట్ శాతం అధికంగా ఉంటుంది. దీని వల్ల మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తుంది.
2. రక్తస్రావం:
బాదం పప్పులో విటమిన్-ఇ అధికంగా ఉంటుంది. దీంలో మీరు బాదంను ఎక్కువగా తింటే.. విటమిన్ ఓవర్ డోస్ అవడమే కాకుండా.. ఇది రక్తస్రావం వంటి తీవ్రమైన వ్యాధుల కారణమవుతుంది.
3. శరీరంలో టాక్సిన్స్ పెరుగుదల:
బాదంలో టాక్సిన్స్ శాతం అధికంగా ఉంటుంది. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ పెరిగి పొట్టకు హాని కలిగిస్తుంది. గర్భిణీ స్త్రీలు దీనిని తినకూడదని వైద్యులు సూచించడానికి కారణం ఇదే.
4. మలబద్ధకం:
ఫైబర్ శాతం బాదంలో చాలా అధికం..కనుక పెద్దలు ఇవి శరీరాని మంచివని భావిస్తారు. అయితే దీనిని అధికంగా తినడం వల్ల మలబద్ధకం, జీర్ణక్రియలో సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చేబుతున్నారు.
5. ఊబకాయం:
ప్రస్తుతం ఊబకాయం పెద్ద సమస్యగా మారింది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని ఈ వ్యాధి వెంటాడుతుంది. మీరు బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడుతుంటే బాదంపప్పును ఎప్పుడూ ఎక్కువ తినొద్దని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది బరువును పెంచడమే కాకుండా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడాని దోహదపడుతుంది.
6. పోషకాహారం తీసుకోవడంలో ఇబ్బంది:
ప్రస్తుతం ఆరోగ్యంగా జీవించేందుకు అందరు ఇష్టపడుతున్నారు. అందులో భాగంగానే బాదం పప్పు లాంటి పోషక విలువలున్న ఆహారాన్ని ఎక్కువ తింటున్నారు. అయితే ఈ బాదంలో అధికంగా ఫైబర్ ఉండటం వల్ల కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం శోషణలో ఆటంకం ఏర్పడుతుంది.
7. శ్వాస సమస్యలు:
బాదంపప్పును పరిమితికి మించి తినడం వల్ల శరీరంలో HCN స్థాయి పెరుగుతుంది. ఇది శ్వాస కోశ వ్యాధులకు దారితీయడమే కాకుండా..శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. అంతే కాకుండా ఊపిరిపోయే ప్రమాదం ఉండవచ్చని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Twitter Parag Agarwal: ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌కు ఎలన్ మస్క్ షాక్..? త్వరలో సాగనంపడం ఖాయం..?
Also Read: Illicit Affair: ప్రాణాల మీదకు తెచ్చిన వివాహేతర సంబంధం... అతని మర్మాంగాలు కోసేసిన యువతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook