Health Tips: రాత్రిపూట అన్నం తినడం ఆరోగ్యానికి హానికరమేనా..? వీరు రాత్రి అన్నం తినొద్దు..!!

Disadvantages Of Eating Rice:  భారత్‌ లో ప్రధాన ఆహారంలో అన్నం (బియంతో వండిన ఆహారం) ఒకటి. అందుకే దీనిని ఓ పవిత్రమైన వంటకంగా భావిస్తారు భారతీయులు. అన్నాని తినడాని వివిధ రకాలు వండుకుంటారు

Written by - ZH Telugu Desk | Last Updated : May 17, 2022, 03:42 PM IST
  • రాత్రిపూట అన్నం తినడం బరువును తగ్గించుకునే వారికి హానికరమే
  • రాత్రి అన్నం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
  • అన్నం జీర్ణవ్యవస్థకు మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది
Health Tips: రాత్రిపూట అన్నం తినడం ఆరోగ్యానికి హానికరమేనా..? వీరు రాత్రి అన్నం తినొద్దు..!!

Disadvantages Of Eating Rice:  భారత్‌ లో ప్రధాన ఆహారంలో అన్నం (బియంతో వండిన ఆహారం) ఒకటి. అందుకే దీనిని ఓ పవిత్రమైన వంటకంగా భావిస్తారు భారతీయులు. అన్నాని తినడాని వివిధ రకాలు వండుకుంటారు.  కొందరు ఫ్రైడ్ రైస్, జీరా రైస్, రాజ్మా, చోలే రైస్ ఇలా చాలా రకాలుగా తినడానికి ఇష్టపడతారు. అన్నంలో కార్బోహైడ్రేట్లు, పోషకల విలువలు ఉంటాయి. దీనితో పాటు ఇందులో ప్రోటీన్, కొవ్వు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంలు కూడా ఉన్నాయి. వీటి ద్వారా శరీరానికి ఎన్నో లభాలు చేకూరుతాయి. ప్రస్తుతం చాలా మంది రాత్రి పూట అన్నం తినాలా వద్దా అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే రాత్రి అన్నాని తినలో వద్దో ఇప్పుడు తెలుసుకుందాం..

రాత్రి అన్నం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

కార్బోహైడ్రేట్ల ప్రధాన మూలం:

బియ్యంలో కార్బోహైడ్రేట్ స్థాయి అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. కార్బోహైడ్రేట్ల నుంచి లభించే శక్తితో నిత్యం మనం పనులు సులభంగా చేసుకోగలుగుతాము. కార్బోహైడ్రేట్లు శరీరానికి మంచి దృఢత్వాన్ని ఇస్తుంది.      

అన్నం కడుపుకు ఎంత ప్రయోజనకరం:

అన్నం కడుపుకు చాలా మేలు చేస్తుంది. ఉడకబెట్టిన అన్నం సులభంగా జీర్ణమవడం వలన కడుపు నొప్పి, అజీర్ణం సమస్యలను దూరం చేస్తుంది. అందుకే వైద్యులు కడుపులో ఎదైన నొప్పి ఉంటే అన్నం, పెరుగును తినమని సలహా ఇస్తుంటారు.

జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరం:

అన్నం కూడా జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల పోషకాలు శరీరంలోని అన్ని భాగాలకు చేరడమే కాకుండా.. శరీరాన్ని దృఢత్వాన్ని ఉంచుతుంది. 

రాత్రి అన్నం తింటే మంచిదేనా?

ప్రతిదానికి దాని ప్రయోజనాలు ఎంతుంటాయే నష్టాలు కూడా అంతే ఉంటాయి. ఇదివరకే మీరు అన్నం తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు. రాత్రిపూట అన్నం తినడం వల్ల మీకు ఎలాంటి హాని కలుగుతుందో ఇప్పుడు తెలుసుకోండి. మీరు మీ బరువును తగ్గించుకునే పనిలో ఉన్నట్లయితే..రాత్రి పూట అన్నం తినడం మంచిది కాదు. ఒక వేళా అన్నం తినాలనుకుంటే.. రాత్రిపూట బ్రౌన్ రైస్ మాత్రమే తినండి. తద్వారా పిండి పదార్థాలకు బదులుగా ఫైబర్ లభిస్తుంది. దీంతో ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్లు పొందవచ్చు.

Also Read: Weight Loss with Banana: అరటి పండును రోజూ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

Also Read: Janhvi Kapoor Pics: పొట్టి డ్రెస్సులో జాన్వీ కపూర్.. అమ్మడిని ఇలా ఎప్పుడూ చూసుండరు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News