Dengue Prevention Tips: వర్షాకాలం, చలికాలంలో ఎక్కువగా కన్పించేది డెంగ్యూ వ్యాధి. దోమకాటుతో వ్యాపించే ఈ వ్యాధి కేసులు ప్రస్తుతం పెరుగుతున్నాయి. కొన్ని పద్ధతులు పాటిస్తే డెంగ్యూ నుంచి రక్షించుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
డెంగ్యూ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. చిన్న నిర్లక్ష్యమైనా సమస్యను పెద్దదిగా మార్చేస్తుంది. దోమకాటుతో వ్యాపించే డెంగ్యూ..మొత్తం శరీరాన్ని బలహీనం చేసేస్తుంది. డెంగ్యూని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కావచ్చు. చాలామంది డెంగ్యూ లక్షణాలు తెలియక నిర్లక్ష్యం చేస్తుంటారు. డెంగ్యూ నుంచి కాపాడుకునేందుకు చాలా పద్ధతులున్నాయి.
డెంగ్యూ లక్షణాలు
- తలపోటు, జాయింట్ పెయిన్స్ అధికంగా ఉంటుంది.
- చలితో పాటు తీవ్రమైన జ్వరం ఉంటుంది.
- గొంతులో, కళ్లలో నొప్పి బాధిస్తుంది
- రుచి ఉండదు, ఆకలి కూడా వేయదు
- రెడ్ ర్యాషెస్ ఏర్పడవచ్చు
డెంగ్యూ నుంచి ఎలా కాపాడుకోవాలి
డెంగ్యూ నుంచి కాపాడుకునేందుకు చికిత్స కంటే నియంత్రణ ముఖ్యం. నివారణ మార్గాలు సరిగ్గా ఉంటే డెంగ్యూ సోకకుండా చూసుకోవచ్చు. డెంగ్యూ దోమ అనేది నిల్వ నీటిలో వృద్ధి చెందుతుంది. అందుకే నీళ్లు ఎక్కడా నిల్వ లేకుండా చూసుకోవాలి. సాధ్యమైనంతవరకూ దోమల్నించి కాపాడుకోవాలి. రాత్రివేళ నిద్రపోయే ముందు మస్కిటోకాయిల్, దోమ తెరలు వంటివి వినియోగించాలి. డెంగ్యూ దోమ అనేది రాత్రి పూట ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. నిల్వ నీటిని తొలగించడం సాధ్యం కాకపోతే..అందులో కొద్దిగా పెట్రోల్ లేదా ఫ్లోర్ ఆయిల్ స్ప్రే చేస్తే చాలు.
శరీరాన్ని సాధ్యమైనంతవరకూ కప్పి ఉంచుకోవాలి. నిండుగా బట్టలు దరించడం ద్వారా దోమకాటు నుంచి రక్షించుకోవచ్చు. లేదా ఒంటికి లోషన్ రాయవచ్చు. బాడీ ఇమ్యూనిటీని పెంచుకోవడం ద్వారా డెంగ్యూ నుంచి సంరక్షించుకోవచ్చు. ప్లేట్‌లెట్ కౌంట్ పెరిగే పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇమ్యూనిటీని పెంచే పదార్ధాలు తీసుకుంటే చాలా మంచిది.
Also read: Heart Attack: అవును మీరు రోజూ తీసుకునే వీటితో కూడా గుండెపోటు వస్తుంది.. తస్మాత్ జాగ్రత్త..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook