Booking 2nd dose of Covishield on CoWIN : కొవిషీల్డ్ 2వ డోస్ కోసం కొవిన్ పై బుక్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. దేశంలో ప్రస్తుతం మూడో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. చాలా రాష్ట్రాలను వ్యాక్సిన్ కొరత వేధిస్తుండటంతో వ్యాక్సిన్ (Corona vaccines) తొలి డోస్ తీసుకునే వారి కంటే ముందుగా ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ కోసం వేచిచూస్తున్న వారికే ప్రాధాన్యత ఇస్తూ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతున్నారు. దీంతో తమ వంతు ఎప్పుడొస్తుందోనని ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోనివాళ్లు అనుకుంటుండగా.. తమకు రెండో డోస్ ఎప్పుడు లభిస్తుందోనని మొదటి డోస్ తీసుకున్న వాళ్లు వేచిచూస్తున్నారు. అలా అన్ని వర్గాల నుంచి కరోనా వ్యాక్సిన్ కోసం వేచిచూసే వారి సంఖ్యే అధికంగా కనిపిస్తోంది.
ఇదిలావుంటే, మరోవైపు కొవీషీల్డ్ ఫస్ట్ డోస్‌కి సెకండ్ డోస్‌కి మధ్య గ్యాప్ పెంచుతూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుచేర్పుల నేపథ్యంలో కొవీషీల్డ్ సెకండ్ డోస్ తీసుకోవాలనుకునే వారు తాము ఎప్పుడు సెకండ్ స్లాట్ బుక్ చేసుకోవాలా అనే గందరగోళానికి గురవుతున్నారు. వారి అయోమయానికి ఫుల్‌స్టాప్ పెడుతూ తాజాగా కొవిన్ పోర్టల్‌పై (CoWin portal) కొవీషీల్డ్ సెకండ్ డోస్ తీసుకునేవారి డీటేల్స్‌ని కేంద్రం అప్‌డేట్ చేసింది. కరోనా ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత కనీసం 84 రోజుల తర్వాత.. అంటే 12 నుంచి 16 వారాల మధ్య కొవీషీల్డ్ సెకండ్ డోస్ తీసుకోవచ్చన్నమాట.
Also read : COVID-19 For Diabetes Patient: డయాబెటిస్ పేషెంట్లకు కరోనా మరింత ప్రమాదకరం, ఈ జాగ్రత్తలు పాటించండి
కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాలు, సూచించిన వివరాల మేరకు కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా కొవీషీల్డ్ సెకండ్ డోస్ లబ్ధిదారుల వివరాలను కొవిన్‌పై అప్‌డేట్ చేశారు. గతంలో కొవీషీల్డ్ తొలి డోస్ తీసుకున్న తర్వాత 4 నుంచి 8 వారాల మధ్య సెకండ్ డోస్ తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా కొవీషీల్డ్ ఫస్ట్ డోస్, కొవీషీల్డ్ సెకండ్ డోస్‌కి మధ్య గ్యాప్ (Gap between Covishield first dose and second dose) పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే కొవీషీల్డ్ సెకండ్ డోస్ (Covishield second jab) కోసం స్లాట్ బుక్ చేసుకుని అపాయింట్‌మెంట్ తీసుకున్న వాళ్లకు స్లాట్ అలాగే ఉంటుందని, కొవిన్ ఆ స్లాట్స్‌ని రద్దు చేయదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
అయితే, ఎవరైనా కొవిషీల్డ్ సెకండ్ డోస్ కోసం ఇప్పటికే తమ స్లాట్స్ బుక్ (Covishield second dose slot booking) చేసుకుని ఉన్నట్టయితే, ఆ అపాయింట్‌మెంట్‌ని స్వచ్చందంగా రద్దు చేసుకుని మళ్లీ 84 రోజుల తర్వాత బుక్ చేసుకుంటే అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని సంబంధిత అధికార యంత్రాంగం సూచిస్తోంది.
Also read : Black Fungus symptoms: బ్లాక్ ఫంగస్ లక్షణాలను గుర్తించకపోతే..అది ప్రాణాల్ని హరించేస్తుంది జాగ్రత్త
ఇదిలావుంటే, కొవాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్లు ఎలాంటి గందరోళానికి గురికావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొవాక్సిన్ తీసుకున్న వాళ్లకు సెకండ్ డోస్ (Gap between Covaxin first dose and second dose) విషయంలో ఎలాంటి మార్పులు లేవు. కొవాక్సిన్ ఫస్ట్ డోస్ (COVAXIN first dose) తీసుకున్న తర్వాత 4 నుంచి 6 వారాల మధ్య కొవాక్సీన్ సెకండ్ డోస్ (COVAXIN second dose) తీసుకోవచ్చు అని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది.
Also read : COVID-19 vaccine తీసుకునే ముందు, తర్వాత ఎలాంటి Foods తినాలి ? ఏవి తినొద్దు ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook