Periwinkle For Control Sugar Level And Blood Pressure: ఆయుర్వేద శాస్త్రంలో అనేక మూలికల గురించి క్లుప్తంగా వివరించారు. అంతేకాకుండా కొన్ని ఔషధ మొక్కల గురించి కూడా పేర్కొంది. మన పూర్వీకులు ఏవైన అనారోగ్య సమస్యల బారిన పడినప్పడు ఔషధ మొక్కలను వినియోగించేవారట. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులకు మూలికలనే వినియోగించేవారట. ఆయుర్వేద శాస్త్రంలో ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క మూలిక ఉంది. అయితే ఈ రోజు మనం మధుమేహాన్ని, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలి వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగించే మొక్క గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మొక్కలో ఉండే ఔషధ గుణాలు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా ప్రాంణాంత వ్యాధులు కూడా నయమవుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఆ మొక్కేంటే అందులో ఉండు ఔషధ గుణాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో బిళ్ళ గన్నేరు మొక్క ఒకటి. ఇది మధుమేహంతో పాటు అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను సైతం దూరం చేస్తాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు బిళ్ళ గన్నేరు మొక్కను ఎలా వినియోగించాలో, దీని వల్ల శరీరానికి కలిగే లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బిళ్ళ గన్నేరు మొక్క వల్ల శరీరానికి కలిగే లాభాలు:
మధుమేహం నియంత్రణ:
బిళ్ళ గన్నేరు ఆకుల రసం ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడానికి ఎంతగానో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే యాంటీ డయాబెటిక్ లక్షణాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
అధిక రక్తపోటు:
బిళ్ళ గన్నేరు ఆకుల్లో రక్తపోటును తగ్గించే శక్తి కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీహైపర్‌టెన్సివ్ లక్షణాలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. దీని కారణంగా రక్త నాళాలను విస్తరిణ, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. అంతేకాకుండా రక్తపోటు కారణంగా వచ్చే సమస్యలు రాకుండా ఉంటాయి.
క్యాన్సర్ నివారణ:
బిళ్ళ గన్నేరులో ఉండే కొన్ని మూలకాలు వింకా ఆల్కలాయిడ్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. దీని కారణంగా ఆల్కలాయిడ్స్ క్యాన్సర్ కణాలు కూడా సులభంగా తొలగిపోయే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఇతర క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
చర్మ సమస్యలు:
బిళ్ళ గన్నేరు ఆకుల రసం చర్మంపై దద్దుర్లు, మొటిమలు, తామర వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా ప్రభావంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మంపై వాపుతో పాటు చికాకును తగ్గించడానికి ప్రభావంతంగా సహాయపడుతుంది.
జలుబు, దగ్గు:
బిళ్ళ గన్నేరు ఆకుల రసం జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా తాగడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ టస్సివ్, యాంటీ ఎక్స్‌పెక్టరెంట్ లక్షణాలు దగ్గును సులభంగా తగ్గించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా శ్లేష్మాన్ని విసర్జించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి