Chyawanprash: ఈసారి ఎండకాలం ఆరంభ దశలోనే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే సాధారణంగా ఆరోగ్యం కోసం చాలా మంది చవన ప్రాశ్ తీసుకుంటుంటారు. వేడి చేస్తుందనే ఉంటుందనే కారణంగా ఎండాకాలకంలో చవనప్రాశ్ తీసుకోవచ్చా అనే విషయంపై సందేహంలో ఉంటారు. మరి ఎండాకాలంలో చవనప్రాశ్ తీసుకోవచ్చా? ఒకవేళ తీసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే ఎండాకాలం కావడంతో చవనప్రాశ్ను వేడి పదార్థాలతో తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. చల్లటి పదార్థాలతో మితంగా తీసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి మంచే జరుగుుతందని వివరిస్తున్నారు.
డాక్టర్‌ను సంప్రదించాకే..
అయితే చవనప్రాశ్ తీసుకోవాలనుకునేవారు ముందుగా డాక్టర్‌ను సంప్రదించాలని చెబుతున్నారు. ఆరోగ్యపరంగా ఎలాంటి హానీ జరగదని నిర్ధారించుకున్నతర్వాతే చవన్‌ప్రాశ్ తీసుకోవాలని అంటున్నారు నిపుణులు.
అయితే వేసవిలో చవనప్రాశ్ను అధికంగా తీసుకంటే.. అజీర్తి, కడుపు ఉబ్బరంగా అనిపించడం, లూజ్ మోషన్స్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
చవనప్రాశ్ సమస్యలు..
వేసవిలో చవనప్రాశ్ అధికంగా తీసుకుంటే.. అలర్జీలు, దద్దుర్ల వంటి సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటు.. మధుమేహం, బీపీ వంటి సమస్యలు ఉన్నవారు కచ్చితంగా వైద్యుడి సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
పాటించాల్సిన జాగ్రత్తలు..
నిజానికి వేసవి వచ్చిందంటే.. తీసుకునే ఆహారంపట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. డీ హైడ్రేషన్‌కు కారణమయ్యే ఆహారం, పానియాలను తీసుకోవద్దని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ఇక చవన ప్రాశ్ తీసుకుంటే.. డైటీషియన్‌ను కూడా సంప్రదించాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
దీర్ఘకాలిక సమస్యలు ఉన్నట్లయితే.. వైద్యుల సలహా మేరకు మాత్రమే చవనప్రాశ్ వాడాలి.
Also read: Honey Facial Benefits: తేనె వినియోగంతో ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు!
Also read: Honey And Garlic Benefits: తేనె-వెల్లుల్లి కలిపి తీసుకోండి.. ఈ వ్యాధులకు చెక్ పెట్టండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook