Chapped Lips Remedies: చలికాలంలో పగిలిన పెదాలు మృదువుగా మారాలంటే ఇలా చేయండి!

Chapped Lips Remedies: చలికాలంలో అనేక చర్మ తలెత్తే అవకాశం ఉంది. చర్మంపై తేమ శాతం తగ్గడం వల్ల శరీరమంతా పొడిబారి.. అనేక అనారోగ్య సమస్యలకు కారణం కావొచ్చు. అదే సమయంలో పెదవులపై పగుళ్లు ఏర్పడడం జరుగుతుంది. ఎలాంటి చిట్కాలు పాటించినా.. పెదాల పగుళ్లను అరికట్టలేకపోవచ్చు. కానీ, ఈ టిప్స్ పాటిస్తే మీ పెదాలు మృదువుగా మారతాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2022, 11:27 PM IST
Chapped Lips Remedies: చలికాలంలో పగిలిన పెదాలు మృదువుగా మారాలంటే ఇలా చేయండి!

Chapped Lips Remedies: చలికాలంలో చర్మానికి సంబంధించిన అనేక సమస్యలు ఎదురవుతాయి. చలి గాలుల వలన చర్మం పొడిబారడం జరుగుతుంది. దీనితో పాటు పెదవులపై పగుళ్లు ఏర్పడతాయి. అయితే ఆ పెదవుల పగుళ్లకు నివారణకు కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటించాల్సి ఉంటుంది. పెదవుల పగుళ్లను నివారించేందుకు కొన్ని సులభమైన మార్గాలను పాటించడం ద్వారా వెంటనే విముక్తి లభిస్తుంది. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం. 

తేనె రాసుకొని..

చలికాలంలో పెదవులపై పగుళ్ల నివారణకై తేనె ఉపయోగించడం చాలా మంచిది. పెదవులపై ఏర్పడే యాంటీబ్యాక్టీరియల్, గాయాన్ని నయం చేసే లక్షణాలు తేనెలో మెండుగా ఉన్నాయి. నిద్ర పోయే ముందు లేదా ఖాళీ సమయంలో పెదవులపై తేనె రాయడం వల్ల పగుళ్లను నివారించవచ్చు. 

క్రీమ్ ల వాడకంతో..

పెదవులపై పగుళ్లను నిర్మూలించేందుకు శరీరానికి తగిన నీటిని తాగడం సహా పెదవులు మృదువుగా కనిపించేందుకు మార్కెట్లో కొన్ని క్రీమ్ లు అందుబాటులో ఉంటాయి. వాటిని పెదవులపై అప్లే చేయడం వల్ల తక్షణ విముక్తి లభిస్తుంది. 

కొబ్బరి నూనె వాడకం..

పెదవులపై తరచుగా కొబ్బరినూనెను ఉపయోగించడం వల్ల పగుళ్ల సమస్య చాలా వరకు నయం అవుతుంది. కొబ్బరి నూనె లో ఉండే గుణాలు పగుళ్లను నివారిస్తాయి. రాత్రి పడుకునే ముందు ఈ కొబ్బరి నూనెను పెదాలకు రాసి.. పొద్దున్న గోరు వెచ్చని నీటితో కడిగి మృదువైన వస్త్రంతో శుభ్రపరిస్తే పెదాలు మృదువుగా తయారవుతాయి. 

(నోట్: పైన పేర్కొన్ని సమాచారం కొన్ని శాస్త్రీయ పద్ధతులను అనుసరించి రాసినది. వీటిని పాటించే ముందు వైద్యుని సంప్రదించడం మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరిచడం లేదు.)  

Also Read: Dark Circles: కంటి కింది నల్లటి వలయాలకు అద్భుతమైన ఇంటింటి చిట్కాలు ఇవే

Also Read: Horsegram Benefits: ఉలవలతో కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News