Boiled Peanuts Benefits: కొంతమందికి పల్లీలు ఉడకబెట్టుకుని తినడం అంటే ఇష్టం. కొంతమంది వేయించుకొని తింటారు. ఈ మారుతున్న సీజన్లో వర్షం పడుతూ ఉంటే వేడి వేడి పల్లీలను ఉడకబెట్టుకుని తింటే ఆ మజానే వేరు. అయితే ఈ పల్లీలు తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యం బాగుంటుందని ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. అయితే పల్లీలను ఉడకబెట్టి ప్రతిరోజు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
ఖనిజాలు పుష్కలం..
ఉడకబెట్టిన పల్లీలలో మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్ ఆరోగ్యకరమైన కొవ్వులు ఫైబర్ రకరకాల విటమించు మినరల్స్ ఉంటాయి ఉడకబెట్టిన పల్లీలను పిడికెడు మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీ శరీర పనితీరుకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
గుండె ఆరోగ్యం..
ముఖ్యంగా పల్లీలలో మోనో శాచ్యురేటెడ్ కవులు పాలీ అన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్రతిరోజు మీ డైట్ లో వీటిని చేర్చుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి. రెండో సమస్యలు రాకుండా ఉంటాయి.
ఇదీ చదవండి: వారానికి ఒక్కసారైనా ఈ కూరగాయ తినండి.. మీ గుండె ఉక్కులా మారుతుంది..
యాంటీ ఆక్సిడెంట్ గుణాలు..
పల్లీలలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్ సమస్యను మీ దరిచేరకుండా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి నివారిస్తుంది దీంతో మంట సమస్యను తగ్గిపోతాయి.
బరువు నిర్వహణ..
పల్లీల్లలో ప్రోటీన్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది దీని వలన మీకు ఎక్కువ సమయం పాటు కడుపు ఆకలిగా అనిపించదు దీనితో అతిగా తినకుండా ఉంటారు బరువు పెరగకుండా ఉంటారు లో ఉన్న వాళ్ళు ఉడికించిన పల్లీలు గుప్పెడు తింటే మంచిది.
షుగర్..
ఫైబర్ పుష్కలంగా ఉండే పల్లీలను ఉడకబెట్టి మనం డైట్ లో చేర్చుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి రక్తంలో చక్కెర స్థాయిలో మెల్లిగా గ్రహిస్తాయి దీంతో షుగర్ లెవెల్స్ హఠాత్తుగా పెరగవు డయాబెటీస్ బాధపడేవారు పల్లీలను డైట్ లో చేర్చుకుంటే మంచిది.
ఇదీ చదవండి: బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్- 3 అంటే ఏమిటి? లక్షణాలు, చికిత్సలు ఏముంటాయి..?
మెదడు ఆరోగ్యం..
ముఖ్యంగా పల్లిల్లో ఫోలెట్ ,ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది బ్రెయిన్ పనితీరు కూడా మేలు చేస్తుంది. ఖనిజాలు అభిజ్ఞ స్థాయిలను మెరుగుపరుస్తాయి, ఆరోగ్యకరమైన నరాల పనితీరు కూడా ప్రోత్సహిస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)