Black Tea with Lemon: శరీరం ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలంటే విటమిన్ సి ప్రాముఖ్యత చాలా ఉంటుంది. ఎందుకంటే రోగ నిరోధక శక్తిని పెంచేంది ఇదే. అందుకే చాలామంది నిమ్మరసం తాగుతుంటారు. కొందరికి బ్లాక్ టీలో నిమ్మరసం కలుపుకుని తాగడం అలవాటు. ఆరోగ్యపరంగా ఇది మంచిదే అయినా తరచూ తాగితే మాత్రం కిడ్నీలపై ప్రతికూల ప్రభావం పడవచ్చు
భారతీయుల్లో టీ అంటే ఆసక్తి చూపించేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అదే పనిగా టీ సేవిస్తుంటారు. వైద్య నిపుణులు ఈ అలవాటు మంచిది కాదని హెచ్చరిస్తున్నా నిర్లక్ష్యం వహిస్తుంటారు. పాల టీ తాగడం వల్ల మధుమేహం, మలబద్ధకం ముప్పు కూడా పెరుగుతుంది. దాంతో ప్రత్యామ్నాయంగా చాలా మంది బ్లాక్ టీ సేవిస్తుంటారు. బ్లాక్ టీలో నిమ్మరసం కలుపుకుని తాగుతుంటారు. నిమ్మలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఫలితంగా ఇమ్యూనిటీ పెరిగి కరోనా వంటి వ్యాధుల్నించి రక్షణ లభిస్తుంది. అయితే బ్లాక్ టీలో నిమ్మరసం అదే పనిగా కలుపుకుని తాగుతుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
కొన్ని కేస్ స్టడీల ప్రకారం ఆకలి తగ్గి, వాంతులు, వికారం లక్షణాలున్న వ్యక్తుల్ని పరీక్షించగా అతని అలవాట్లలో బ్లాక్ టీ లెమన్ ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఫలితంగా అతని కిడ్నీల సామర్ధ్యం తగ్గినట్టుగా గుర్తించారు. ఇలాంటి కేస్ స్టడీలు చాలానే ఉన్నట్టు తెలిసింది. అంటే బ్లాక్ టీ విత్ లెమన్ తరచూ తాగితే కిడ్నీలపై ప్రతికూల ప్రభావం పడుతోంది
అంటే మోతాదుకు మించి నిమ్మరసం కలిపిన కాడా తాగేవారిలో క్రియేటినిన్ పెరుగుతుందని గమనించారు. క్రియేటినిన్ ఎప్పుడూ 1 కంటే తక్కువ ఉండాలి. శరీరంలోని వ్యర్ధాల్ని ఎప్పటికప్పుడు తొలగించడంలో కిడ్నీల పాత్ర కీలకం. ఇందులో ఏమైనా సమస్య వస్తే మొత్తం శరీరంపై ప్రభావం కన్పిస్తుంది. ఏదైనా సరే అవసరానికి మించి తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఇదే పరిస్థితి బ్లాక్ టీ విత్ లెమన్ విషయంలో మరోసారి తేలింది.
Also read: Vote Casting Tips: ఓటు సరిగ్గా పడిందో లేదో ఎలా తెలుస్తుంది, ఈ జాగ్రత్తలు పాటించండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook