Black Salt For Bad Cholesterol: బ్లాక్‌ సాల్ట్‌తో బోలెడు లాభాలు, చెడు కొలెస్ట్రాల్‌ను అద్భుతంగా కరిగిస్తుంది

Black Salt For Bad Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆహారంలో కేవలం బ్లాక్‌ సాల్ట్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 9, 2023, 12:02 PM IST
Black Salt For Bad Cholesterol: బ్లాక్‌ సాల్ట్‌తో బోలెడు లాభాలు, చెడు కొలెస్ట్రాల్‌ను అద్భుతంగా కరిగిస్తుంది

Black Salt As Cholesterol Lowering Foods: ఆహారాలు నోటికి రుచిగా ఉండడానికి ప్రతి రోజు ఆహారంలో ఉప్పును వినియోగిస్తూ ఉంటారు. ఉప్పులేని ఆహారాలను తినడం చాలా కష్టమని అందరికీ తెలిసిందే..అయితే ప్రస్తుతం చాలా మంది ఆహారాల్లో ఉప్పును అతిగా వినియోగిస్తున్నారు. దీని కారణంగా అధిక రక్తపోటు సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఉప్పు కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల ప్రాణాంతకంగా మారే ఛాన్స్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడేవారు తెల్ల ఉప్పును తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాల బారిన పడతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

తెల్ల ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పును తినాల్సి ఉంటుంది:
ఆధునిక జీవనశైలి కారణంగా చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి వారికి ఆహారాల్లో అతిగా ఉప్పును వినియోగించడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా దీనికి బదులుగా వైద్య నిపుణులు సూచిస్తున్న బ్లాక్‌ సాల్ట్‌ను ఆహారంలో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే మూలకాల అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

Also Read: Virat Kohli: జిమ్‌లో చెమటలు చిందిస్తున్న విరాట్ కోహ్లీ.. ఆ ఫిట్‌నెస్ ఏంది సామీ..!  

బ్లాక్‌ సాల్ట్‌ లాభాలు:
కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది:

ప్రతి రోజు ఆహారాల్లో బ్లాక్‌ సాల్ట్‌ తీసుకోవడం వల్ల శరీరంలో రక్తాన్ని పల్చగా చేస్తుంది. అంతేకాకుండా రక్త ప్రసరణను కూడా మెరుగుపరుచుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా అధిక రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా రక్తపోటు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆహారంలో ఈ ఉప్పును మాత్రమే వినినియోగించాల్సి ఉంటుంది. 

ఊబకాయాన్ని తగ్గిస్తుంది:
బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు తీసుకునే డైట్‌లో ఆహారాలు తీసుకునే క్రమంలో తప్పకుండా నల్ల ఉప్పు వినియోగించాల్సి ఉంటుంది. దీని వినియోగించడం వల్ల బరువు తగ్గడమేకాకుండా పొట్ట చుట్టు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

వాంతులు, మలబద్ధకానికి చెక్‌:
తరచుగా వాంతులు, మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు బ్లాక్‌ సాల్ట్‌ను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఉండే గుణాలు తీవ్ర పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా తీవ్ర పొట్ట సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE TELUGU NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Virat Kohli: జిమ్‌లో చెమటలు చిందిస్తున్న విరాట్ కోహ్లీ.. ఆ ఫిట్‌నెస్ ఏంది సామీ..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News