Anjeer For Diabetes And Seasonal Diseases: చలికాలంలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల చాలా మందిలో అనారోగ్య సమ్యలు ఉత్పన్నమవుతాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి అంజీర్ పండ్లను ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు సీజనల్ వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడతాయి. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షింస్తుంది. అంతేకాకుండా అంజీర్ పండ్లను సూపర్ ఫుడ్స్‌గా కూడా భావిస్తారు. వీటిని క్రమం తప్పకుండా పాలలలో తినడం వల్ల పొట్ట సమస్యలు సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. అయితే వీటిని తరుచుగా తీసుకోవడం వల్ల కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అంజీర్ పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. చాలా మంది చలికాలంలో శారీరక శ్రమను తగ్గిస్తారు. దీని వల్ల శరీర బరువు వేగంగా పెరుగుతారు. అయితే పెరుగుతున్న శరీర బరువును నియంత్రించుకోవడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన అంజీర్ పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని రాత్రి పూట పాలలో నానబెట్టి తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గతాయి. ఇందులో తక్కువ కేలరీలు లభించడం వల్ల పెరుగుతున్న శరీర బరువును తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.
2. అంజీర్ పండ్లలో విటమిన్లు, పొటాషియం, మినరల్స్, కాల్షియం అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదపడతాయి. ముఖ్యంగా శీతాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు రాకుండా సహాయపడతాయి.
3. శరీరంలో కాల్షియం లేదా ఐరన్ లోపం సమస్యలతో బాధపడుతున్నవారికి అంజీర్ పండ్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే గుణాలు రక్తహీనతను తగ్గించి శరీరంలో రక్త కోరత లేకుండా చేస్తాయి. అంతేకాకుండా ఇందులో కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా సులభంగా నియంత్రణలో ఉంటాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: King Cobra Viral Video: ఒకే బిలంలో 6 కింగ్ కోబ్రాలు.. ఎంత ఈజీగా పట్టాడో! మీరే చూడండి
Also Read: Jupiter Transit 2023: బృహస్పతి సంచారం.. కొత్త ఏడాదిలో ఈ ఆరు రాశుల వారికి అంతా శుభమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook