సినీ నటి శ్రీదేవి దుబాయ్ లో మరణించిన తరువాత దేశంలో గత నాలుగు రోజులుగా మీడియా ఛానళ్లు అనేక కథనాలను ప్రసారం చేశారు. ఆమె నటించిన చిత్రాల సన్నివేశాలను, పాటలను కూడా ప్రసారం చేస్తూ ఆమె గొప్పతనం, నటనను పొగిడారు. వార్తాపత్రికలు కూడా ఆమెపై అనేక కథనాలు, వ్యాసాలు ప్రచురించాయి. అలానే మీడియా అత్యుత్సాహంతో ఆమె మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ మరికొన్ని కథనాలను ప్రసారం చేశాయి. దీనిపై సినీ ప్రముఖులు అందరూ తప్పుబట్టిన సంగతి తెలిసిందే..!
తాజాగా దీనిపై సినీనటి కస్తూరి శంకర్ భిన్నంగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'శ్రీదేవి మరణిస్తే ఆమె సినిమాల్లోని పాటలు, కొన్ని సన్నివేశాలను అన్ని ఛానళ్లు ప్రసారం చేస్తున్నాయి. అయితే సన్నీలియోన్ చనిపోతే ఏం ప్రసారం చేస్తాయో? ఆశ్చర్యమేస్తోంది' అని వెటకారంగా ప్రశ్నించింది. శ్రీదేవి, సన్నీలియోన్ ఫోటోలను జతచేసి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
All the news channels are showing songs and clips of Late Sridevi
Wondering what will happen when Sunny Leone expires someday😲😜🤪#facebook #forward pic.twitter.com/D1whQIV1kD— kasturi shankar (@KasthuriShankar) February 27, 2018
సన్నీలియోన్ చనిపోతే ఏ సన్నివేశాలు వేస్తారో?