రోజులు గడుస్తున్న సాహో స్పీడ్ తగ్గడం లేదు. నిన్నటితో 10 రోజుల రన్ పూర్తిచేసుకున్న సాహో...ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లు రాబట్టింది. వసూళ్ల పరంగా నాలుగు వందల కోట్ల క్లబ్ లోకి చేరినప్పటికీ హిట్ పరంగా చూస్తే బాహుబలి, బాహుబలి-2 సినిమాల తర్వాతి స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే హిందీ వెర్షన్ వంద కోట్ల మార్క్ఈజీగా దాటేసిన సాహో ... వీకెండ్ వసూళ్లతో కలుపుకొని ఇది 112 కోట్ల రూపాయలకు చేరింది. నార్త్ లో బిగ్గెస్ట్ హిట్స్ ఆఫ్ ది ఈయర్ టాప్ 10 జాబితాలో చోటు సంపాదించుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే సొంత ఇలాఖాలో సాహో సినిమాకు భారీగా వసూళ్లు రాబడతోంది. శని, ఆదివారాలు ఈ సినిమాకు కాస్త వసూళ్లు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 120 కోట్లకు అమ్మారు.
ఏపీ, నైజాం 10 రోజుల షేర్ :
నైజాం – రూ. 27.36 కోట్లు
సీడెడ్ – రూ. 11.05 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 8.58 కోట్లు
ఈస్ట్ – రూ. 7.14 కోట్లు
వెస్ట్ – రూ. 5.40 కోట్లు
గుంటూరు – రూ. 7.75 కోట్లు
నెల్లూరు – రూ. 4.13 కోట్లు
కృష్ణా – రూ. 4.93 కోట్లు
సాహో హవా ; జస్ట్ పది రోజుల్లో రూ. 400 కోట్ల దోపిడి !!