రావుగోపాల్ రావు సతీమణి కన్నుమూత

ప్రముఖ సినీ నటుడు రావురమేశ్‌ తల్లి, దివంగత నటుడు రావుగోపాల్ రావు సతీమణి కమలా కుమారి కొండాపూర్ లోని  స్వగృహంలో కన్నుమూశారు.

Last Updated : Apr 7, 2018, 04:26 PM IST
రావుగోపాల్ రావు సతీమణి కన్నుమూత

ప్రముఖ సినీ నటుడు రావురమేశ్‌ తల్లి, దివంగత నటుడు రావుగోపాల్ రావు సతీమణి కమలా కుమారి కొండాపూర్‌లోని  స్వగృహంలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె వ‌య‌స్సు 73 ఏళ్లు. కమలాకుమారి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

కమలాకుమారి హరికథ కళాకారిణిగా పేరుతెచ్చుకున్నారు. ఆమె తండ్రి కూడా హరికథ కళాకారుడు కావడంతో ఆమె చిన్నతనం నుండే ఆ కళలో పట్టు సాధించారు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఒడిశా తదితర ప్రాంతాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. ఓ షోలో కమలాకుమారి ప్రదర్శనకు ముగ్ధుడైన రావుగోపాల్‌ రావు ఆమెను ప్రేమవివాహం చేసుకున్నారు. రావు గోపాల్ రావు, కమలా కుమారి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రావుగోపాల్‌రావు పెద్ద కుమారుడు రావురమేశ్‌ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు.

Trending News