వారేవ్వా...రామ్ పెర్ఫామెన్స్ కు చరణ్ ఫిదా !!

ఎనర్జిటిక్ హీరో రామ్ తన నటలతో ప్రేక్షులనే కాదు మెగా పవర్ లాంటి నటులను సైతం మెప్పిస్తున్నాడు

Last Updated : Jul 26, 2019, 05:11 PM IST
వారేవ్వా...రామ్ పెర్ఫామెన్స్ కు చరణ్ ఫిదా !!

ఎనర్జిటిక్ హీరోగా గుర్తింపు పొందిన రామ్.. ఇస్మార్ట్ శంకర్ మూవీ తో మరింత ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు. ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీల చేత ఔరా... ఏం యాక్టింగ్ అనే స్థాయిలో ప్రసంశలు అందుకుంటున్నాడు. తాజాగా ఇస్మార్ట్ శంకర్ లో రామ్ ఫెర్మామెన్స్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. 

రీసెంట్ గా సినిమా చూసిన చరణ్.. రామ్ యాక్టింగ్ తో పాటు పూరి డైరక్షన్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. ''ఇష్మార్ట్ శంకర్'' లో హీరో రామ్ ఎనర్జిటిక్ గా ఫెర్ఫాం చేశాడని చరణ్ కితాబిచ్చాడు. ఇదే సందర్భంలో డైరక్టర్ పూరీతో పాటు యూనిట్ లో ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్ చెప్పాడు.

విడుదలైన రోజు నుంచి బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్నాడు ఇస్మార్ట్ శంకర్.... వారం రోజులు దాటినా ఈ సినిమా హవా ఏమాత్రం తగ్గలేదు. నిన్నటితో 8 రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ మూవీ 60 కోట్ల క్లబ్ లోకి ఎంటరైంది. 

 

Trending News