coronavirus test samples: కరోనా శాంపిళ్ళను లాక్కున్న కోతి..

మీరట్ లోని మెడికల్ కాలేజీ వద్ద కరోనా అనుమానితుల శాంపిళ్లను తీసుకెళ్లిన కోతులు అందరిని ఆట పట్టించాయి. ఇదే అంశంపై ఆసుపత్రి చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ ధీరజ్ బాల్యాన్ ఒక ప్రకటన విడుదల చేశారు.

Last Updated : May 29, 2020, 10:02 PM IST
coronavirus test samples: కరోనా శాంపిళ్ళను లాక్కున్న కోతి..

న్యూఢిల్లీ: మీరట్ లోని మెడికల్ కాలేజీ వద్ద కరోనా అనుమానితుల శాంపిళ్లను తీసుకెళ్లిన కోతులు అందరిని ఆట పట్టించాయి. ఇదే అంశంపై ఆసుపత్రి చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ ధీరజ్ బాల్యాన్ ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనావైరస్ రోగుల నమూనాలను కోతులు లాక్కున్నాయని అన్నారు. అటవీ శాఖకు సమాచారం ఇవ్వబడిందని, కాగా కోతులను ఇంకా పట్టుకోలేదన్నారు. ఈ విషయం దర్యాప్తులో ఉందని మీరట్ జిల్లా అధికారి అనిల్ ధింగ్రా మాట్లాడుతూ కరోనా నమూనాలు తీసుకెళుతున్న ల్యాబ్ టెక్నీషియన్ పై కోతిమూక దాడి చేసిందని, అతడి నుంచి చేజిక్కించుకున్న నమూనాలతో చెట్టెక్కి చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తూ భయాందోళనలు కలిగించాయన్నారు. 

Also Read: Gold rate jumps: భగ్గుమన్న బంగారం ధరలు..

ఇదిలాఉండగా వాటిలో ఒక కోతి కరోనా శాంపిల్ ను నోటితో పీల్చడం చూసి ప్రజలు ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. దీనిపై డాక్టర్లు స్పందిస్తూ, ఆ కోతులకు కరోనా వస్తుందని, ఇప్పుడు కోతుల కారణంగా కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని భయపడుతున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News