కార్తికేయ 2 కాన్సెప్ట్ వీడియో ఇదిగో.. !!

 హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం కార్తికేయ 2. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు.  వీరిద్దరి కాంబినేషన్ లో 2014లో వచ్చిన థ్రిల్లర్ సినిమా కార్తికేయ  చిత్రానికి ఇది సీక్వెల్.  అప్పట్లో కార్తికేయ సినిమా మంచి హిట్ కొట్టింది. దీంతో మళ్లీ కార్తికేయ 2 సినిమాకు శ్రీకారం చుట్టారు.

Last Updated : Mar 2, 2020, 11:05 AM IST
కార్తికేయ 2 కాన్సెప్ట్ వీడియో ఇదిగో.. !!

 హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం కార్తికేయ 2. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు.  వీరిద్దరి కాంబినేషన్ లో 2014లో వచ్చిన థ్రిల్లర్ సినిమా కార్తికేయ  చిత్రానికి ఇది సీక్వెల్.  అప్పట్లో కార్తికేయ సినిమా మంచి హిట్ కొట్టింది. దీంతో మళ్లీ కార్తికేయ 2 సినిమాకు శ్రీకారం చుట్టారు. 

ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కార్తికేయ -2 సినిమా ఎలా ఉండబోతోందో.. ఓ వీడియోను చిత్ర యూనిట్ పంచుకుంది.  దీనికి సంబంధించిన కాన్సెప్ట్ వీడియోను లాంచ్ చేసింది.  ఈ కాన్సెప్ట్ వీడియో చూస్తుంటే ..  దాదాపు 5వేల 118 ఏళ్ల క్రితం నాటి రహస్యం ఆధారంగా చిత్ర కథను అల్లుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ రహస్యం ఏంటి..? దాని చుట్టూ అల్లిన కథ ఎలా ఉండబోతోంది.. ? సినిమా చూసిన తర్వాతే తెలుస్తుంది.

‘అర్జున్‌ సురవరం’ చిత్రం తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకున్న నిఖిల్‌..  కార్తికేయ 2తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌  ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. కాలభైరవ సంగీతం అందించనున్నఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..    Read Also: పవర్ స్టార్ ఫ్యాన్స్ బీ రెడీ..!! 

Trending News