రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబోలో సినిమా ప్రకటించిన నిర్మాత

బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

Last Updated : Jun 16, 2018, 04:00 PM IST
రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబోలో సినిమా ప్రకటించిన నిర్మాత

బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సినిమా చేయనున్నట్టు మనం గతంలో చెప్పుకున్నదే. దాదాపు ఓ ఏడాది కాలంగా వీళ్లిద్దరి కాంబినేషన్ గురించి పరిశ్రమలో చర్చు జరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరి కాంబోలో సినిమా గురించి ఓ అధికారిక ప్రకటన వెలువడింది. బోయపాటి దర్శకత్వంలో చెర్రీ హీరోగా ఓ సినిమాను నిర్మించనున్నట్టు ప్రముఖ నిర్మాత, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత డీవీవీ దానయ్య అధికారికంగా ప్రకటించారు. రామ్ చరణ్ కెరీర్‌లో 12వ సినిమాగా సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ స్పష్టంచేసింది. ఈ మేరకు ఆ సంస్థ శనివారం మధ్యాహ్నం ఓ ట్వీట్ చేసింది.

 

చెర్రీతో బోయపాటి సినిమా చేయడం ఇది మొదటిసారి కాగా మొత్తంగా మెగా ఫ్యామిలీకి చెందిన హీరోతో బోయపాటి చేయనున్న రెండో సినిమా ఇది. అవును, గతంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో సరైనోడు సినిమా చేసిన బోయపాటి.. ఆ సినిమాతో బన్నీకి కెరీర్‌లో ఓ సూపర్ హిట్ అందించాడు. దీంతో ఇప్పుడు బోయపాటి-చెర్రీ కాంబినేషన్‌పై సైతం భారీ అంచనాలే ఏర్పడుతున్నాయి. 

Trending News