Vishnu Manchu Wedding : ప్రతీ క్షణం ప్రేమలో పడుతూనే ఉంటాను.. పెళ్లి రోజున భార్యపై మంచు విష్ణు పోస్ట్

Vishnu Manchu Wedding Anniversary మంచు విష్ణు పెళ్లి రోజు నేడు. ఈ సందర్భంగా తన భార్య మీద ప్రేమను కురిపించాడు. ఆమెను చూస్తూ ప్రతీ క్షణం ప్రేమలో పడుతూనే ఉంటున్నాను అంటూ తన భార్య మీదున్న ప్రేమను చూపించాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2023, 10:44 AM IST
  • మంచు విష్ణు పెళ్లి రోజు
  • భార్య విరానికపై స్పెషల్ పోస్ట్
  • ప్రతీ రోజూ ప్రేమలో పడుతుడున్నాడట
Vishnu Manchu Wedding : ప్రతీ క్షణం ప్రేమలో పడుతూనే ఉంటాను.. పెళ్లి రోజున భార్యపై మంచు విష్ణు పోస్ట్

Vishnu Manchu Wedding Anniversary మంచు విష్ణు ప్రస్తుతం అటు సినిమాలు, ఇటు మా అధ్యక్షుడిగా ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. గత ఏడాది జిన్నా అంటూ పలకరించాడు. కానీ అనుకున్న విజయాన్ని సాధించలేకపోయాడు. ఇప్పుడు మళ్లీ తనకు ఎంతో ఫేవరేట్ డైరెక్టర్ అయిన శ్రీనువైట్లతో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడు. డబుల్ డోస్ అనే సినిమా ఉంటుందని గత ఏడాది చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంచు విష్ణు సినిమాలు విషయాలు పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్ గురించి ఆయన ఓ పోస్ట్ వేశాడు.

నేడు (మార్చి 1) మంచు విష్ణు పెళ్లి రోజు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మేనకోడలు విరానికా రెడ్డితో మంచు విష్ణు ప్రేమ వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇక వీరి ప్రేమ వ్యవహారం కాస్తా 2009లో  వివాహా బంధంగా మారింది. ఇరు  కుటుంబ సభ్యులను ఒప్పించి మంచు విష్ణు ఈ వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే. 

మంచు విష్ణు విరానికలకు నలుగురు సంతానం అన్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు ఫ్యామిలీ ఫోటోలు ఎంత నిండుగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ తన భార్య, పిల్లలతోనే కలిసి ఉంటాడు మంచు విష్ణు. మంచు విష్ణు బాధ్యతల్లో అండగా నిలబడుతుంది విరానికా రెడ్డి.

రాజకీయ కుటుంబం నుండి వచ్చినా కూడా డిజైనర్‌గా పని చేస్తూనే మోహన్ బాబు విద్యా సంస్థలలోని న్యూయార్క్ అకాడమీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా రాణిస్తున్న తను తాజాగా లండన్, దుబాయ్, దోహ వంటి వివిధ దేశాలలో కూడా బోటిక్ సంబందించిన  బ్రాంచిలను నెలకొల్పడానికి సిద్దమైంది. 

 

అలా విరానిక తన జీవితంలో ఎంతటి ముఖ్య పాత్రను పోషిస్తుందో చెప్పుకొచ్చాడు మంచు విష్ణు. పెళ్లి రోజు సందర్భంగా మంచు విష్ణు వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. నా ఈ జీవితంలోని ప్రేమవి నువ్వే.. నిన్ను చూసే ప్రతీ క్షణం నీతో ప్రేమలో పడుతూనే ఉన్నాను.. నీ డ్రామాలు, లాంగ్ ట్రిప్స్, ఫ్రీకీ ఫ్రైడేలు, నీ క్రేజీ పనులతో నా లైఫ్ అంతా ఆనందంతో నింపేస్తోన్నందుకు థాంక్స్.. నీపై అంతులేని ప్రేమ ఉంది అంటూ చెప్పుకొచ్చాడు మంచు విష్ణు.

Also Read:  Anupama Parameswaran Saree pics : కొప్పున పూలెట్టుకొని.. అందమంటే అనుపమదేనా?.. చీరకట్టుకే కళ వచ్చిందా?

Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News