Thangalaan: విక్రమ్ నెత్తిన పాలు పోసిన అల్లు అర్జున్.. తంగలాన్ కు అలా కలిసొచ్చింది..

Thangalaan: చియాన్ విక్రమ్ నెత్తిన పాలు పోసిన అల్లు అర్జున్.. అవును సుకుమార్ దర్శకత్వంలో బన్ని హీరోగా నటించిన ‘పుష్ప 2’ సినిమా ఆగష్టు 15 రిలీజ్ డేట్ నుంచి తప్పుకోవడంతో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో బడా చిత్రాలు ఆ డేట్ లోకి పోలో మంటూ క్యూ కడుతున్నాయి.  ఈ  నేపథ్యంలో పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తంగలాన్’ సినిమా ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 20, 2024, 06:30 AM IST
Thangalaan: విక్రమ్ నెత్తిన పాలు పోసిన అల్లు అర్జున్.. తంగలాన్ కు అలా కలిసొచ్చింది..

Thangalaan: అల్లు అర్జున్.. పుష్ప 2 మూవీ ఆగష్టు 15 నుంచి పక్కకు తప్పుకోవడంతో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ తాజాగా కోలీవుడ్ లో ఓ అబౌ యావరేజ్ చిత్రాలతో పాటు బడా చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. తాజాగా చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ బ్యాక్ డ్రాప్  ‘తంగలాన్’ చిత్రాన్నిఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.
ఈ చిత్రాన్ని బ్రిటిష్ కాలం నాటి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ బంగారు గనుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. "తంగలాన్" సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ కథానాయికలుగా యాక్ట్ చేస్తున్నారు.   కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

రీసెంట్ గా రిలీజ్ చేసిన "తంగలాన్" సినిమా ట్రైలర్ కు సోషల్ మీడియాలో అదిరిపోయే  రెస్పాన్స్ వచ్చింది. అలాగే 'మనకి మనకి..' లిరికల్ సాంగ్ కూడా ఛాట్ బస్టర్ అయ్యింది. రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ కు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తోంది. ‘తంగలాన్’ చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం గ్యారంటీ అని చెబుతున్నారు.  

విక్రమ్ విషయానికొస్తే.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియన్ సెల్వన్’ రెండు పార్టులతో పలకరించారు. ఈ సినిమా కోలీవుడ్ లో మాత్రమే సక్సెస్ అయింది. మిగతా భాషల్లో ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. తాజాగా ‘తంగలాన్’ చిత్రంతో విక్రమ్ ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చూపెడుతాడా లేదా అనేది చూడాలి. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ ఎస్ మూర్తి ఆర్ట్ వర్క్ అందించారు. ఆర్కే సెల్వ ఎడిటింగ్. స్టన్నర్ సామ్ స్టంట్స్ కొరియోగ్రఫి అందించారు.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News