Vijay Devarkonda: విజయ దేవరకొండ సినిమా నుంచి శ్రీలీల అవుట్.. మరో సెన్సేషనల్ హీరోయిన్ ఇన్

Sreeleela: ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా ‘ప్రేమలు’ బ్యూటీ మమిత బైజు లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ముందుగా ఈ సినిమాలో శ్రీలీల అని అనుకున్న.. కొన్ని కారణాలవల్ల శ్రీలీల ఈ చిత్రానికి నో చెప్పిందట..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 9, 2024, 08:58 PM IST
Vijay Devarkonda: విజయ దేవరకొండ సినిమా నుంచి శ్రీలీల అవుట్.. మరో సెన్సేషనల్ హీరోయిన్ ఇన్

Mamitha Baiju: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం గతవారం విడుదలైన తన ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.ఫ్యామిలీ స్టార్ మూవీ తర్వాత విజయ్ ,జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో మూవీ చేయాల్సి ఉంది. ఈ మూవీ లో హీరోయిన్ గా మొదట శ్రీలీల ను ఫిక్స్ చేశారు. ఫ్యామిలీ స్టార్ మూవీ కంప్లీట్ కాకుండా విజయ్ తన నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేయలేకపోవడంతో ఈ చిత్రం అంతకంత డిలే అవుతూ వచ్చింది.అయితే మూవీ షూటింగ్ లేట్ అవుతూ రావడం తో శ్రీలీల కు డేట్స్ అడ్జస్ట్ కాలేదట. అంతేకాకుండా ఈ విజయ్ సినిమాలో కొన్ని ఘాటు సన్నివేశాలు ఉండడంతో ఫైనల్ గా శ్రీలీల ఈ సినిమాకి నో చెప్పినట్టు తెలుస్తోంది.

స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ మూవీ పై విజయ్ అశలు అన్ని ఉన్నాయి. లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు ఆశించిన ఫలితాలను అందివ్వడంలో విఫలమయ్యాయి.కాబట్టి ఏలాగైన తన నెక్స్ట్ మూవీ తో సక్సెస్ సాధించాలి అని విజయ్ ప్రయత్నిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీ విజయ్ ఫ్యామిలీ స్టార్ కోసం వాయిదా పడింది. దీంతో శ్రీలీల కు ముందుగా చెప్పిన టైం కి షూటింగ్ జరగలేదు. ఇప్పుడు తీరా షూటింగ్ అనుకునే టైంకి శ్రీలీల వేరే మూవీస్ కు ఓకే చెప్పడం జరిగింది. పైగా ప్రస్తుతం శ్రీలీల ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ కూడా ఉండడంతో తాను చాలా బిజీ గా ఉంది.

కాబట్టి ఇప్పుడు విజయ్ దేవరకొండ మూవీ కోసం శ్రీలీల డేట్స్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె ప్లేస్ లో వేరే హీరోయిన్ రీప్లేస్ చేశారు. అయితే రీప్లేస్ అయిన హీరోయిన్  మరి ఎవరో కాదు..మమిత బైజు. మలయాళం లో సూపర్ హిట్ సినిమా ప్రేమలు తెలుగులో రిలీజ్ అయ్యాక ఓవర్ నైట్ స్టార్ గా మారిన ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ పక్కన ఇప్పుడు చాన్స్ కొట్టేసింది అని టాక్. ప్రేమలో మూవీలో తన క్యూట్ లుక్స్ తో యూత్ మదిదోచిన మమిత బైజు కు నిజంగా ఈ మూవీ లో ఛాన్స్ దక్కినట్లయితే ఇక తెలుగు ఇండస్ట్రీలో కూడా ఆమెకు మంచి ఆఫర్స్ రావడం కన్ఫామ్.

Also Read: Revanth Reddy Flight: రేవంత్‌ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం ...

Also Read: TS Weather: తెలంగాణ ప్రజలకు ఎండల నుంచి ఊరట.. రాగల మూడు రోజులు వర్షాలు

 

 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News