Vijay-Rashmika: మళ్లీ దొరికిపోయిన విజయ్-రష్మిక.. ఇక పెళ్లి ప్రకటనే..!

Vijay Devarkonda: విజయ్ దేవరకొండ రష్మిక మందాన ప్రేమ వ్యవహారం వారు అధికారికంగా చెప్పకపోయినా.. ఈ మధ్య జరుగుతున్న కొన్ని విషయాలను బట్టి తెలుగు ప్రేక్షకులు అందరూ వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఈ నేపథ్యంలో మరోసారి మీడియా కంటికి ఒక విషయంలో దొరికిపోయింది ఈ జంట. మరి అది ఎలానో చూద్దాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2023, 03:58 PM IST
Vijay-Rashmika: మళ్లీ దొరికిపోయిన విజయ్-రష్మిక.. ఇక పెళ్లి ప్రకటనే..!

Rashmika Mandanna: అధికారికంగా చెప్పకపోయినా విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమలో ఉన్నారు అన్న విషయం ఈమధ్య చిన్నపిల్లోడికి కూడా అర్థమయ్యేలాగా మారింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వీరిద్దరే క్లూస్ ఇస్తూ మరి.. ఇక వారి పెళ్లి ప్రకటన మాత్రమే మినహాయింపు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు…

మొన్న బాలకృష్ణ షోలో రష్మిక మాటలు .. తప్పకుండా ఆమె రౌడీ పిల్ల అన్నట్టు విజయ్ ఫ్యాన్స్ కి కన్ఫర్మేషన్ ఇచ్చేసింది. ఇక వెంటనే ఒక హిందీ సింగింగ్ షోలో విజయ్ దేవరకొండ అమ్మని తన సెకండ్ మదర్ అని చెబుతూ.. విజయ్ ఫ్యామిలీతో తనకున్న ప్రేమని కూడా చెప్పేసింది రష్మిక. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఈ జంట మీడియా కళ్ళకి దొరికిపోయింది. అయితే కలిసి మాత్రం కాదు.. ఒకే డ్రెస్సులో వీళ్ళిద్దరూ దొరికిపోయారు.

అసలు విషయానికి వస్తే ఈరోజు రష్మిక మందాన ఢిల్లీలో యానిమల్ ప్రమోషన్స్ ముగించి ముంబైకి వచ్చింది. ఇక ముంబై ఎయిర్ పోర్టులో రష్మిక సందడి చేసింది. అక్కడున్న మీడియా వారంతా రష్మికానీ వీడియో తీయడం మొదలుపెట్టారు.. కాగా రౌడీ వియర్స్‌ను రష్మిక ధరించింది. ఇక అక్కడి ఫోటో గ్రాఫర్లను ఆమెను ఫన్నీగా ఏడిపించ సాగారు. విజయ్ దేవరకొండ డ్రెస్సు వేసుకున్నారు కదా అని అందరూ అడుగుతుంటే దానికి రష్మిక నవ్వేసింది. ఇక మరో పక్క  అలాంటి డ్రెస్సులోనే విజయ్ దేవరకొండ ఈరోజు కనిపించడం విశేషం. హైదరాబాద్లో ఓటేసేందుకు వచ్చిన విజయ్ దేవరకొండ, ఎయిర్ పోర్టులో రష్మిక కనిపించిన డ్రెస్సు లోనే దర్శనం ఇచ్చారు.

ఇక ఇదంతా చూసిన నేటిజన్స్ అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు.. అసలు విషయం అధికారికంగా చెప్పొచ్చు కదా అని అంటున్నారు. అంతేకాదు ఇక మీరు పెళ్లి ప్రకటించడం ఒక్కటే మినహాయింపు అని చాలామంది తమాషాగా ఈ వైరల్ అవుతున్న ఫోటోలు కింద కామెంట్లు పెడుతున్నారు..

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News