Virata Parvam Pre Release Event: 'విరాట‌ప‌ర్వం' ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్‌లుగా ఇద్ద‌రు స్టార్ హీరోలు?

Venkatesh is Chief Guest for Virata Parvam Pre Release Event. విరాట ప‌ర్వం ప్రీ రిలీజ్ వేడుకకు గెస్ట్‌గా విక్టరీ వెంకటేష్ రానున్న‌ట్లు స‌మాచారం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 13, 2022, 05:33 PM IST
  • జూన్‌ 17న విరాట‌ప‌ర్వం విడుదల
  • విరాట‌ప‌ర్వం ప్రీ రిలీజ్ ఈవెంట్
  • గెస్ట్‌లుగా ఇద్ద‌రు స్టార్ హీరోలు
Virata Parvam Pre Release Event: 'విరాట‌ప‌ర్వం' ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్‌లుగా ఇద్ద‌రు స్టార్ హీరోలు?

Venkatesh is Chief Guest for Virata Parvam Pre Release Event: రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'విరాట పర్వం'. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌రా సినిమాస్, సురేష్‌ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌ల‌పై సుధాక‌ర్ చెరుకూరితో క‌లిసి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. నక్సలిజం నేపథ్యంలో 1990ల్లో జరిగిన యదార్థ సంఘటనల స్ఫూర్తితో విరాట పర్వం సినిమా తెరకెక్కింది. ఈ సినిమా జూన్‌ 17న విడుదల కానుంది. దాంతో ప్రొమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచిన చిత్ర యూనిట్.. ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేసింది.

ఆదివారం (జూన్ 12) విరాట పర్వం సినిమాలోని విప్లవ సాంగ్‌ వీడియోను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. విరాట ప‌ర్వం ప్రీ రిలీజ్ వేడుక త్వ‌ర‌లోనే జ‌రుగునుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా విక్టరీ వెంకటేష్ రానున్న‌ట్లు స‌మాచారం. అబ్బాయి రానాని స్వయంగా దీవించేందుకు వెంకీ వస్తున్నాడు. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్ కూడా గెస్ట్‌గా వస్తున్నట్లు టాక్. అయితే ప్రస్తుతం చెర్రీ.. పదో వెడ్డింగ్‌ యానివర్సరీ కోసం సతీమణి ఉపాసనతో కలిసి ఇటలీ వెళ్ళాడు. అప్పటివరకు వస్తాడో లేదో మరి. 

విరాట పర్వం చిత్ర‌బృందం తాజాగా వ‌రంగల్‌లో ఆత్మీయ వేడుకను జ‌రిపించారు. దానికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇటీవ‌లే విడుద‌లైన ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను న‌మోదు చేసింది. తెలంగాణలో 1990 దశకంనాటి నక్సలైట్‌ ఉద్యమాల స్ఫూర్తితో ఈ చిత్రం రూపొందింది. విరాట పర్వంలో కామ్రేడ్‌ రవన్నగా రానా, ఆయన ప్రేయసి వెన్నెలగా సాయి పల్లవి నటించారు. నవీన్‌ చంద్ర ఉద్యమకారుడు రఘన్నగా, ప్రియమణి కామ్రేడ్‌ భారతక్కగా నటించారు. 

Also Read: Kethika Sharma: కేతిక శ‌ర్మ‌కు బంపర్ ఆఫర్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో హీరోయిన్‌గా!

Also Read: IPL Media Rights: భారీ ధరకు అమ్ముడుపోయిన ఐపీఎల్ మీడియా రైట్స్.. ఈసారి ఏ కంపెనీకో తెలుసా?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News