Operation Valentine Movie Review: 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ రివ్యూ.. ఆపరేషన్ సక్సెస్..

Operation Valentine Movie Review: పెళ్లి  తర్వాత వరుణ్ తేజ్ నటించిన ఫస్ట్ మూవీ 'ఆపరేషన్ వాలెంటైన్'. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరాయి. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని వరుణ్ తేజ్.. తాజాగా 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీతో పలకరించారు. మరి ఈ సినిమాతో వరుణ్ తేజ్ కోరకున్న సక్సెస్ అందుకున్నాడా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 1, 2024, 07:57 AM IST
Operation Valentine Movie Review: 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ రివ్యూ.. ఆపరేషన్ సక్సెస్..

రివ్యూ: ఆపరేషన్ వాలెంటైన్ (Operation Valentine)
నటీనటులు: వరుణ్ తేజ్, మానుషి చిల్లర్, మిర్ సర్వర్, రుహాని శర్మ, నవదీప్ తదితరులు
సినిమాటోగ్రఫీ: హరి కే వేదాంతం
ఎడిటర్: నవీన్ నూలి
మాటలు: సాయి మాధవ్ బుర్రా
సంగీతం: మిక్కీ జే మేయర్
నిర్మాత: సోనీ పిక్చర్స్, సందీప్ ముద్ద
దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్ హుడా
విడుదల తేది: 1-3-2024

Operation Valentine Movie Review: గత కొన్నేళ్లుగా తెలుగు సహా అన్ని సినీ ఇండస్ట్రీస్‌లో నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ కోవలో వచ్చిన మరో సినిమా 'ఆపరేషన్ వాలెంటైన్'. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను అట్రాక్ట్ చేసిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

ఆపరేషన్ వాలెంటైన్ మూవీ కథ విషయానికొస్తే..  అర్జున్ రుద్రదేవ్ (వరుణ్ తేజ్) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్వాడ్రన్ లీడర్. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని నిలబడే రకం. ఇతను ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసే రాడార్ ఆఫీసర్ అహనా గిల్ (మానుషి చిల్లర్‌)తో ప్రేమలో పడతారు. ఈ నేపథ్యంలో డిఫెన్స్ వాళ్లు ఆపరేషన్ వజ్రను స్టార్ట్ చేస్తారు. కానీ ఆ మిషన్ ఫెయిల్ కావడంతో రుద్రదేవ్ తీవ్ర గాయాల పాలైవుతాడు. ఆ తర్వాత మెల్లగా కోలుకుంటాడు. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న పాకిస్థాన్‌కు చెందిన ముష్కర మూకలు మన దేశ సైనికుల ప్రాణాలను బలిగొంటారు. ప్రేమికుల దినోత్సవం రోజున జరిగిన ఈ ఘాతుకానికి బదులు తీర్చుకోవడానికి భారతీయ వైమానిక దళం 'ఆపరేషన్ వాలెంటైన్' పేరుతో ఓ ఆపరేషన్‌కు స్టార్ట్ చేస్తారు. దాన్ని రుద్రదేవ్ ముందుండి నడిపిస్తాడు. ఈ నేపథ్యంలో ఏం జరిగింది ? చిరవకు ఆపరేషన్ వజ్ర సక్సెస్ అయిందా అనేది తెలియాలంటే తెరపై ఆపరేషన్ వాలెంటైన్ చూడాల్సిందే.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

మన దేశంలో జరిగిన అతిపెద్ద ఘాతుకాన్ని తెరకెక్కించడం అంటే ఆషామాషీ కాదు. ఈ కుట్ర వెనక  ప్రత్యర్ధి దేశం పాకిస్థాన్ ఎలాంటి వ్యూహ రచన చేసింది.  ఆ తర్వాత పాక్  విసిరిన సవాళ్లకు మన దేశం ఎలాంటి ధీటైన సమాధానం ఇచ్చారనే విషయాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించారు దర్శకుడు. 2019 ఫిబ్రవరి 14 మన దేశానికి అసలు సిసలు బ్లాక్ డే. దాదాపు మన దేశానికి 40 జవాన్లను పాకిస్థాన్‌కు చెందిన ముష్కర మూకలు బాంబ్ దాడితో బలిగొన్నారు. దీంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అలాంటి ఘటనను తెరపై చక్కగా చూపించాడు. ఇలాంటి సినిమాలు తీయాలంటే అపుడు ఏం జరిగిందనే దానిపై పూర్తి అవగాహన ఉండాలి. డిఫెన్స్ అధికారుల సహాయ సహకారాలు.. పేపర్స్‌లో వచ్చిన ఘటన తాలూకు సంఘటనలను మిళితం చేసి కొంచెం కల్పితంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ హీరో, హీరోయిన్ రొమాన్స్, ఎయిర్ ఫోర్స్ అధికారిగా వరుణ్‌ తేజ్ ఫ్లైయింగ్ వంటి సన్నివేశాలను అద్భుతంగా చూపించాడు.

అంతేకాదు ఒక దేశం గర్వించే స్థాయికి చేరాలంటే బలమైన నాయకుడే కాదు.. ఆ నాయకుడి ఆదేశాలను సరైన క్రమంలో అమలు చేసే సైనికులు ఉండి తీరాల్సిందే. ఈ క్రమంలో హీరో వరుణ్ తేజ్ పాత్రను డిజైన్ చేసాడు. ఇక దేశ భక్తి అంటే ముఖ్యంగా మనకు ఆర్మీకి సంబంధించిన వాళ్ల స్టోరీలనే తెరకెక్కిస్తారు. కానీ మన దేశ విజయంలో ఆర్మీతో పాటు నేవీ, ఎయిర్ ఫోర్స్ కీలక పాత్ర ఎలా పోషిస్తాయనే విషయాన్ని ఈ సినిమాలో ప్రస్తావించారు. గతంలో వచ్చిన బార్డర్ మూవీలో చివరకు మన ఎయిర్ ఫోర్స్ సహాయంతో 1971లో పాకిస్థాన్ యుద్ధం జయించిన విషయాన్ని ప్రజలకు తెలిసేలా చేసారు. ఇందులో పుల్వామా ఎటాక్.. ఆ తర్వాత మన దేశం బాలాకోట్ పై సర్జికల్ స్ట్రెక్స్ చేయడం.. ఆ తర్వాత పాకిస్థాన్‌కు చెందిన ఎయిర్ ఫోర్స్ మన దేశం వైమానిక దళాలపై ఎటాక్‌కు ప్రయత్నించడం. దాన్ని మన దేశ సైనికులు ఎలా తిప్పికొట్టారనేది తెరపై అద్భుతంగా చూపించారు. పూర్తిగా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో  కమర్షియల్ అంశాలకు దూరంగా నాచురల్‌గా తీసాడు. ఈ సినిమాలో దర్శకుడి శక్తి ప్రతాప్ సింగ్ పడిన కష్టం తెరపై కనిపించింది. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. జమ్మూ కశ్మీర్ అందాలతో పాటు యుద్ధ సన్నివేశాలను తెరపై చక్కగా ఆవిష్కించాడు. గ్రాఫిక్స్ వర్క్‌తో పాటు నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల విషయానికొస్తే..

వరుణ్ తేజ్ ఒక మూసకు పరిమితం కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో అలరిస్తున్నాడు. స్వాడ్రన్ లీడర్ రుద్రప్రతాప్ సింగ్ పాత్రలో ఒదిగిపోయాడు. మానుషి చిల్లర్ తన పరిధి మేరకే నటించింది. మిర్ సర్వర్ ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.

ప్లస్ పాయింట్స్

కథ

డైరెక్షన్

యాక్షన్ సీక్వెన్స్

మైనస్ పాయింట్స్

ఫస్టాఫ్

సీరియస్‌గా సాగే స్టోరీ

కమర్షియల్ అంశాలు

రేటింగ్.. 3/5

పంచ్ లైన్.. ఆపరేషన్ వాలెంటైన్ .. ఆపరేషన్ సక్సెస్

Also read: Pawan Kalyan: జగన్‌ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు.. జెండా సభలో గర్జించిన జనసేనాని

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News