Matka Trailer Talk: వరుణ్ తేజ్.. దగ్గర టాలెంట్ ఉన్నా.. సరైన సక్సెస్ మాత్రం దక్కడం లేదు. ‘గద్దలకొండ గణేష్’ తర్వాత వరుణ్ తేజ్ కు హిట్ అన్నదే లేదు. ఎన్నోఆశలు పెట్టుకున్న ‘ఆపరేషన్ వాలంటైన్’ మూవీ బాగున్నా.. కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ కాలేదు. తాజాగా వరుణ్ తేజ్.. గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మట్కా’. కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఇందులో వివిధ ఏజ్ లలో వరుణ్ తేజ్ ట్రాన్స్ ఫామ్ బాగుంది. ఓ రకంగా.. ‘గాడ్ ఫాదర్’, కమల్ హాసన్ ‘నాయకుడు’ సినిమాలను గుర్తుకు తెచ్చాయి.
‘మట్కా’ అంటే జూదం. ఈ నేపథ్యంలో ముంబై బ్యాక్ గ్రౌండ్ లో ఈ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు. ఆనాటి విజువల్స్ అన్ని బాగున్నాయి. ఆర్ట్ వర్క్ పనితనం కనిపిస్తోంది. వరుణ్ తేజ్..గద్దలకొండ గణేష్ తర్వాత మరోసారి డాన్ పాత్రలో నటించాడు. ముఖ్యంగా హాజీ మస్తాన్, వరద రాజన్ మొదలియార్, దావూడ్ ఇబ్రహీం వంటి డాన్ ల జీవిత నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్దమవుతోంది. తాజాగా ఈ ట్రైలర్ పై చిరంజీవి ప్రశంసల ఝళ్లు కురిపించారు.
Presenting the official trailer of #MATKA!
Very proud to see your hunger for unique scripts & your versatility never ceases to amaze me, my dear @IamVarunTej 😊❤️ & This one looks fabulous 👌
My best wishes to the entire team for the release on Nov… pic.twitter.com/KiwPHpCGlw
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 2, 2024
ముఖ్యంగా ఓ పేదవాడు.. ఎలా తన ధైర్య సాహసాలతో డాన్ గా ఎదిగాడనే కాన్సెస్ట్ అని అర్థమవుతోంది. ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు సహా ఇతర భాషల్లో ఇలాంటి రొటిన్ డాన్ తరహా సినిమాలు ఎన్నో వచ్చాయి. ఎంత కొత్తగా తెరపై ప్రెజెంట్ చేసిన విధానంపైనే ‘మట్కా’ విజయం ఆధారపడి ఉంటుంది. మరి ఈ కోవలో రాబోతున్న ‘మట్కా’ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter