Sekhar Master Emotional : ఢీ కొరియోగ్రాఫర్ సూసైడ్.. చాలా హర్ట్ చేశారంటూ వర్ష.. మిస్ అవుతున్నామంటూ శేఖర్ మాస్టర్

Written by - ZH Telugu Desk | Last Updated : May 1, 2023, 01:08 PM IST
  • అప్పుల బాధతో చైతన్య మాస్టర్ మృతి
  • చైతన్య మాస్టర్ సూసైడ్ వీడియో వైరల్
  • కన్నీరు పెట్టిన వర్ష, శేఖర్ మాస్టర్
Sekhar Master Emotional : ఢీ కొరియోగ్రాఫర్ సూసైడ్.. చాలా హర్ట్ చేశారంటూ వర్ష.. మిస్ అవుతున్నామంటూ శేఖర్ మాస్టర్

Sekhar Master on Chaitanya Master Suicide ఢీ కొరియోగ్రాఫర్‌ చైతన్య మాస్టర్  మృతి పట్ల బుల్లితెర వర్గాల వారు, సినీ వర్గాల వారు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న చైతన్య మృతిపై పలువురు ప్రముఖులు స్పందించారు. చైతన్య మాస్టర్ ఇలా చేసి ఉండకూడదు అంటూ పలువురు పలు రకాలుగా ఆయనతో తమ అనుబంధం ను నెమరవేసుకుంటూ ఫోటోలు షేర్‌ చేస్తూ నెట్టింట ఆత్మకు శాంతి కలగాలంటూ కోరుకుంటున్నాం అంటూ ప్రార్థిస్తున్నారు. 

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sekhar Vulli Vj (@sekharmaster)

ఢీ షో లో పాల్గొనే వారితో పాటు జబర్దస్త్‌ ఇతర టీవీ షో ల్లో కనిపించే వారందరికి కూడా చైతన్య మాస్టర్ సుపరిచితుడు. అందుకే ఆయన మృతి పట్ల పలువురు బుల్లి తెర సెలబ్రిటీలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. చైతన్య మాస్టర్‌ మృతిపట్ల జబర్దస్త్‌ లేడీ కమెడియన్‌ వర్ష స్పందించారు. ఆమె సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌ పెట్టింది. 

'మాస్టర్ మీరు ఇలా సూసైడ్ చేసుకుని..మమ్మల్ని చాలా హర్ట్‌ చేశారు .. మేము మిమ్ములను మిస్ అవుతున్నాం మాస్టర్' అంటూ వర్ష తన సంతాపంను తెలియజేస్తూ సోషల్‌ మీడియాలో మాస్టర్‌ ఫోటోను షేర్‌ చేసింది. వర్ష జబర్దస్త్‌ తో పాటు ఢీ ఇతర షో ల్లో పాల్గొన్న సమయంలో చైతన్య కొరియోగ్రఫర్‌గా వ్యవహరించాడు. తనకు ఎన్నో కార్యక్రమాల్లో డాన్స్ చేసేందుకు కొరియోగ్రఫీ చేసిన మాస్టర్‌ చైతన్య ఇలా చనిపోవడం పట్ల వర్ష కన్నీటి పర్యంతం అవుతున్నట్లుగా ఆమె సన్నిహితులు అంటున్నారు. 

Also Read:  Chaithanya Master Suicide : ఢీ కొరియోగ్రఫర్ మృతి.. ఆ కారణాలతోనే సూసైడ్

వర్ష మాత్రమే కాకుండా ఢీ జడ్జ్‌ శేఖర్ మాస్టర్ కూడా చైతన్య మాస్టర్ మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతిభావంతుడు అయిన డాన్సర్ ను కోల్పోయినందుకు గుండె పగిలినంత బాధగా ఉంది. ఈ వార్త విన్నప్పుడు నేను చాలా డిస్ట్రబ్‌ అయ్యాను. నీ నవ్వు నీ మంచితనంను ఎప్పటికి మర్చిపోలేను అంటూ శేఖర్ మాస్టర్ ఇన్‌ స్టా గ్రామ్‌ లో పోస్ట్‌ పెట్టాడు. శేఖర్ మాస్టర్‌ ఇంకా ఎంతో మంది ప్రముఖులు కూడా చైతన్య మాస్టర్ మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తమ సంతాపంను తెలియజేస్తున్నారు.

Also Read:  Mallemala Remunerations : ఢీ షోలో చాలీచాలని రెమ్యూనరేషన్‌లు!.. కొరియోగ్రఫర్ మృతితో మల్లెమాలపై మరో మరక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News