Pawan Kalyan: వకీల్ సాబ్‌తో మరో సినిమాకు దిల్ రాజు ప్లాన్స్ ?

Vamsi Paidipally to direct Pawan Kalyan ?: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో వకీల్ సాబ్ మూవీ నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న నిర్మాత దిల్ రాజు.. తాజాగా పవన్ కల్యాణ్‌తో మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేతిలో వచ్చే ఏడాది చివరి వరకు చిత్రాలు ఉండటంతో దిల్ రాజుతో సినిమా ఆ తర్వాతే ఉంటుందేమోననే టాక్ వినిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 9, 2021, 12:08 AM IST
Pawan Kalyan: వకీల్ సాబ్‌తో మరో సినిమాకు దిల్ రాజు ప్లాన్స్ ?

Vamsi Paidipally to direct Pawan Kalyan ?: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో వకీల్ సాబ్ మూవీ నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న నిర్మాత దిల్ రాజు.. తాజాగా పవన్ కల్యాణ్‌తో మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేతిలో వచ్చే ఏడాది చివరి వరకు చిత్రాలు ఉండటంతో దిల్ రాజుతో సినిమా ఆ తర్వాతే ఉంటుందేమోననే టాక్ వినిపిస్తోంది.

ఇంతకీ పవర్ స్టార్‌తో సినిమాకు ప్లాన్ చేసిన దిల్ రాజు.. ఆ సినిమా కోసం ఎంచుకున్న దర్శకుడిని ఎవరిని అనే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం. బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి లాంటి బ్లాక్‌బస్టర్స్‌ని డైరెక్ట్ చేసిన వంశీ పైడిపల్లి (Vamsi Paidipally) దర్శకత్వంలో దిల్ రాజు ఓ సినిమా చేయనున్నట్టు టాక్. 

తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ (Vamsi Paidipally to direct Vijay) హీరోగా వంశీ పైడిపల్లి ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తాజాగా టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో వార్తలొస్తున్నాయి. విజయ్‌తో సినిమా తెరకెక్కించాలనే ఊపుమీదున్న వంశీ పైడిపల్లిని దిల్ రాజు నేరుగా పవన్ కల్యాణ్ వద్దకు తీసుకెళ్లాడనేదే తాజాగా ఫిలింనగర్‌లో వినిపిస్తున్న టాక్. 

వంశీ పైడిపల్లి చెప్పిన స్టోరీ లైన్ పవన్ కల్యాణ్‌కి నచ్చిందా లేదా ? నచ్చితే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందనే వివరాలు ఏవీ ఇంకా బయటకు రాలేదు కానీ.. వంశీ పైడిపల్లిని దిల్ రాజు స్వయంగా పవన్ కల్యాణ్‌ (Vamsi Paidipally meets Pawan Kalyan) వద్దకు తీసుకెళ్లడమే ప్రస్తుతానికి టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మంచి అభిరుచి కలిగిన నిర్మాతగా పేరున్న దిల్ రాజు దర్శకుడు వంశీ పైడిపల్లిని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వద్దకు వెంటపెట్టుకెళ్లాడంటే.. కచ్చితంగా వంశీ వద్ద ఏదో ఓ ఆకట్టుకునే స్టోరీ లైన్ ఉండే ఉంటుందని ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

Trending News