Vijay Devarakonda: తినడానికి తిండి లేదు.. మాకు తోడుగా నిలిచింది విజయ దేవరకొండనే.. ట్రాన్స్‌జెండర్ ఎమోషనల్

Vijay Devarakonda Foundation:సహాయం చేయడంలో ఎప్పుడూ ముందు ఉండే హీరో విజయ్ దేవరకొండ. ఈ మధ్య కూడా ఖుషి సినిమా రిలీజ్ అయిన తరువాత ఎన్నో ఫామిలీస్ కి తన రెమ్యూనరేషన్ నుంచి డబ్బులు తీసి ఇచ్చారు. అయితే అది తను మొదటి సహాయం కాదు అంతకు ముందు కరోనా సమయంలో ఎంతోమందికి అండగా నిలిచాడు ఈ హీరో. మరి ఆయన నుంచి సహాయం పొందిన ఒక ట్రాన్స్‌జెండర్ ఇప్పుడు విజయ్ ని ఆకాశానికి ఎత్తేసింది..  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2023, 07:24 PM IST
Vijay Devarakonda: తినడానికి తిండి లేదు.. మాకు తోడుగా నిలిచింది విజయ దేవరకొండనే.. ట్రాన్స్‌జెండర్ ఎమోషనల్

Vijay Devarkonda:చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో సూపర్ హిట్ సాధించి అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. కాగా విజయ దేవరకొండ అని ఎంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారో అంతేమంది విపరీతంగా ఇష్టపడే వారు కూడా ఉన్నారు.

 

విజయ దేవరకొండ అంటే విపరీతంగా అభిమానించే అభిమానులు ఉన్నారు. ఆయన బయట ఇచ్చే స్పీచ్ లేదా ఇంటర్వ్యూలలో విజయ్ యటిట్యూడ్ ని కొంతమంది తిట్టినా కానీ ఆయన చేసే సహాయాలకి ఎంతోమంది పొగుడుతూ ఉంటారు. ఈ రౌడీ హీరో తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది కి ఎన్నో రకాలుగా సహాయం చేశారు. ముఖ్యంగా కరోనా టైంలో ఈ హీరో చాలామందికి తోడుగా నిలిచాడు. అయితే విజయ్ దేవరకొండ మంచిదనం గురించి తాజాగా ఓ ట్రాన్స్‌జెండర్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

 

కరోనా టైంలో టాలీవుడ్ ఏర్పాటు చేసిన సీసీసీకి విరాళం ఇచ్చాడు. అంతేకాదు తన సహాయం అక్కడితో ఆపకుండా మరలా తన ఫౌండేషన్ ద్వారా చాలామందికి సాయం చేశాడు.

 

ఇక ఇలా కరోనా టైం లో విజయ దేవరకొండ దగ్గర నుంచి సహాయం పొందిన ఒక ట్రాన్స్ జెండర్ ఈమధ్య ఈ హీరో గురించి చెప్పిన మాటల వీడియో వైరల్ అవుతోంది. ఇందులో విజయ్ ఫౌండేషన్ చేసిన సాయం ఎప్పటికీ మరువలేనంటూ ఆమె చాలా ఎమోషనల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ..'కరోనా టైంలో లాక్డౌన్ పెట్టారు.. కానీ మాకు ఆ సమయంలో తినడానికి తిండి కూడా దొరకలేదు ... రూం రెంట్ కట్టుకునేందుకు కూడా డబ్బులు లేవు.. అలాంటి టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడే విజయ్ దేవరకొండ ఫౌండేషన్ గురించి తెలిసి.. దాంట్లో ఫాం నింపాను.. ఇక ఆ పని చేసిన వెంటనే టీం రియాక్ట్ అయింది.. మాకు వెంటనే సరుకులు కొనుక్కోండి.. బిల్లు పంపండి అని ఫోన్ పే చేశారు.. ఆ రోజు పొందిన సాయాన్ని ఎప్పటికీ మరిచిపోను.. నాలానే చాలా మంది ట్రాన్స్‌జెండర్లకు సాయం చేశారు' అని చెప్పుకొచ్చింది.

 

ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, విజయ దేవరకొండ అంటే పడని వారు కూడా ఈమె మాటలు విని ఆయన చేసిన సహాయాన్ని మెచ్చుకుంటున్నారు.

 

సినిమాల విషయానికి వస్తే ఈ మధ్య ఖుషీ సినిమాలో కనిపించిన విజయ్ దేవరకొండ త్వరలోనే పరశురాం దర్శకత్వంలో రానున్న ఫ్యామిలీ స్టార్ తో మనల్ని పలకరించనున్నారు.

Also Read: Zebronics Juke Bar 9750 Pro: డెడ్‌ చీప్‌ ధరకే JBL సౌండ్‌ బార్‌ను మించిన Zebronics Juke బార్‌..ధర, ఫీచర్స్‌ వివరాలు ఇవే!  

Also Read: IND Vs SL Highlights: శ్రీలంకకు టీమిండియా అదిరిపోయే పంచ్.. సెమీస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ..!  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News