Tollywood senior actor Kaikala Satynarayana Hospitalised Due To Ill Health: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆయన ప్రమాదవశాత్తు ఇంట్లో జారి కిందపడ్డారు. ఆయన్ని సికింద్రాబాద్‌లోని (Secunderabad) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని, ఆందోళన పడాల్సి అవసరం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్ కథానాయకుడు, ‘మహర్షి’ (Maharshi) చిత్రాల తర్వాత ఆయన వెండితెరకు దూరంగా ఉన్నారు.
అయితే కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) తెలుగు ఇండస్ట్రీతో పాటు పలు సినీ పరిశ్రమల ఆర్టిస్టులు ఎంతో గౌరవం ఇస్తుంటారు. ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు మంచు విష్ణు (Manchu Vishnu)... కైకాల సత్యనారాయణ ఇంటికెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఇక ఆ మధ్య కైకాల సత్యనారాయణ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి. (Megastar Chiranjeevi) ఈ మేరకు చిరు తన సతీమణితో కలిసి సత్యనారాయణ నివాసానికి వెళ్లారు. తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు అంటూ సత్యనారాయణను కొనియాడారు. కైకాల సత్యనారాయణ తనకు ఎంతో ఆప్తుడని వెల్లడించారు.
Also Read : IND Vs NZ Match Prediction: ఇండియా Vs న్యూజిలాండ్ మ్యాచ్.. కీలక మ్యాచ్‌లో నిలిచేదెవరు?
అలాగే కన్నడలో యశ్ (Yash) హీరోగా రూపొందిన కెజియఫ్ (KGF) తెలుగులోనూ సంచలన విజయం సాధించింది. తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ ఈ చిత్రం సంచలన వసూళ్ళు తీసుకొచ్చింది. ఈ చిత్రానికి తెలుగు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు సంబంధం ఉంది. కెజియఫ్ సినిమాలో కైకాల సత్యనారాయణ సమర్పించు అని పడుతుంది. తెలుగులో ఈ చిత్రానికి సాయి కొర్రపాటితో కలిసి విజయ్ కిరగందూర్లతో పాటు కైకాల సత్యనారాయణ సమర్పించు అంటూ టైటిల్ కార్డ్ వేశారు.కైకాల వారసుడు నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడు. కెజియఫ్ చిత్ర సమర్పకుడిగా కైకాల పేరు పడటం వెనక కారణం కూడా అదే. ఈయన వారసుడు కన్నడంలో నిర్మాణ రంగంలో ఉన్నాడు. అక్కడ ఆక్ష్న కెజియఫ్ సినిమా సహ నిర్మాతగా కూడా ఉన్నాడు. ఆ సమయంలోనే సినిమా రేంజ్ ముందుగానే ఊహించిన కైకాల తనయుడు (Kaikala Son) తెలుగులో ఈ చిత్ర రైట్స్ కోసం పోటీ పడ్డాడు. అయితే సాయి కొర్రపాటి (Sai Korrapati) లాంటి అగ్ర నిర్మాత అండగా ఉంటే మంచి రిలీజ్ వస్తుందని భావించి ఆయనతో కలిసి విడుదల చేసాడు. అందుకే కెజియఫ్ (KGF) సినిమాకు ముందు కైకాల సత్యనారాయణ సమర్పణ అని పడుతుంది. ఈ సినిమా విడుదలై సంచలన విజయం సాధించిన తర్వాత కైకాల సత్యనారాయణకు సన్మానం కూడా చేసింది కెజియఫ్ చిత్రయూనిట్.
కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) అభినయం తెలుగువారిని ఆరు దశాబ్దాలుగా అలరిస్తూనే ఉంది. విలన్ గా వికట్టాహాసం చేసినా, కేరెక్టర్ యాక్టర్ గా కన్నీరు పెట్టించినా, కమెడియన్ గా కడుపుబ్బ నవ్వించినా.. ఏది చేసినా అందులో తన మార్కు ప్రదర్శించారు సత్యనారాయణ (Kaikala Satyanarayana). ఆయన క్షేమంగా ఆస్పత్రి నుంచి తిరిగిరావాలని టాలీవుడ్ (Tollywood) నటులు కోరుకుంటున్నారు.
Also Read : Mamata Banerjee: మమత టార్గెట్ మారిందా, కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన దీదీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి