Tollywood IT Rides: ఐటీ రైడ్స్ టార్గెట్.. వెనకున్నదెవరు..?

Tollywood IT Rides: గత కొన్నేళ్లుగా సినిమాల్లో కలెక్షన్స్ కు సంబంధించిన పోకడ ఎక్కువైంది. ఎవరు నిజం చెబుతున్నారు. ఎవరు అబద్ధం చెబుతున్నారనేది పై వాడికి ఎరక అన్నట్టు తయారైంది పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కోసారి హీరోలను సంతృప్తి పరచడానికి ఎక్కువ నంబర్స్ కలెక్షన్స్ తో పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నారు. దీన్ని బేస్ చేసుకొని ఆదాయపు పన్ను అధికారులు ఒక్కసారి తెలుగులో అగ్ర నిర్మాతలైన దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 23, 2025, 03:35 AM IST
Tollywood IT Rides: ఐటీ రైడ్స్ టార్గెట్.. వెనకున్నదెవరు..?

Tollywood IT Rides: తెలుగు చిత్ర పరిశ్రమలో  ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి.  ఒక్కసారి బడా నిర్మాతల ఇళ్లు, కార్యాలయాలపై దాడుల వెనక ఉన్నదెవరనేది ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. భాగ్యనగరంలో గత రెండు, మూడు రోజులుగా టాలీవుడ్ ప్రముఖులు, వాళ్ల బంధువుల ఇళ్లు,ఆఫీసులపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మొన్నటి నుంచి దిల్ రాజు, మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా సంస్థల కార్యాలయాలపై ఐటీ అధికారులు  సోదాలు నిర్వహిస్తోంది.

ముఖ్యంగా పుష్ప సిరీస్ డైరెక్టర్ సుకుమార్ నివాసంలో  ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎయిర్ పోర్టు నుంచి సుకుమార్ ను నేరుగా ఇంటికి తీసుకెళ్లారు ఐటీ అధికారులు.  పుష్ఫ 2 సినిమాకు తీసుకున్నపారితోషఖం ,ఆదాయ వివరాలపై సుకుమార్ ను  ఆరాదీస్తున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఐటీ సోదాలు చేస్తున్న ఈ  ప్రొడ్యూసర్స్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన   చిత్రాలు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సాధించాయి.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన   సంక్రాంతికి వస్తున్నాం మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే  మైత్రీ మూవీస్ నిర్మించిన పుష్ఫ2 దేశ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ క్రమంలోనే సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ కలెక్షన్స్ పై కూడా ఆరాతీసినట్టు తెలిసింది. దిల్‌రాజు ఇంటిలో ఐటీ దాడులు రెండో రోజు కొనసాగాయి. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా వారం రోజుల్లో రూ. 200 కోట్ల కలెక్షన్స్‌పైనే ఐటీ అధికారులు ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా పోస్టర్‌ ముందు పెట్టి దిల్‌ రాజును ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అది కేవలం ప్రచారం మాత్రమేనని, నిజంగా అన్ని కలెక్షన్స్‌ రావని దిల్‌రాజు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News