Bagundi teaser : విరాటపర్వం దర్శకుడు చేతులు మీదుగా విడుదలైన బాగుంది సినిమా టీజర్

Bagundi teaser : మంచి సినిమా తీస్తే హీరోతో సంబంధం లేకుండా ఆదరిస్తున్నారు మన తెలుగు ప్రేక్షకులు. కాగా ఇప్పుడు అదే కోవలో వస్తోంది బాగుంది అనే సినిమా. సినిమా పేరే కాదు ఈ చిత్రం కూడా నిజంగా బాగుంటుంది అని చెబుతున్నారు ఈ చిత్ర ఇక ఈ సినిమా టీచర్ ని దర్శకుడు వేణు ఉడుగుల విడుదల చేశారు. మరి ఈ టీజర్ గురించి మరిన్ని విశేషాలు ఒకసారి చూద్దాం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2023, 11:28 AM IST
Bagundi teaser : విరాటపర్వం దర్శకుడు చేతులు మీదుగా విడుదలైన బాగుంది సినిమా టీజర్

Venu Udugula: కిషోర్ తేజ,  భవ్యశ్రీ హీరోహీరోయిన్లుగా వస్తోన్న సినిమా బాగుంది. ఈ చిత్రాన్ని కట్ట శివ సమర్పణలో శ్రీ సాయి ప్రొడక్షన్స్ బ్యానర్ పై  ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు.వెంకటేశ్వర్ రావు, డా. మహేంద్రబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో దేవి శ్రీ పద్మా జయంతి, పద్మిని, రామోజు వంశీకృష్ణ, విజయ్ భాస్కర్  పద్మిని, చిట్టిబాబు, మల్లిక్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఇక రాజనేని హర్ష ప్రవీణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంని నీది నాది ఒకే కథ అలానే విరాటపర్వం లాంటి సినిమాలు మనకు అందించిన ప్రముఖ దర్శకులు వేణు ఉడుగుల,సెవెన్ హిల్స్ సతీష్  లాంచ్ చేశారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు రామకృష్ణ గౌడ్ హైద‌రాబాద్ ప్రసాద్ ల్యాబ్ లాంచ్ చేశారు. 

ఈ ఈవెంట్ లో దర్శకులు వేణు ఉడుగుల మాట్లాడుతూ.. "బాగుంది" సినిమా టీజర్ నిజంగా బాగుంది. హీరో కిషోర్ తేజ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. డైరెక్టర్ రామ్ కుమార్  చాలా పెర్ఫెక్ట్ గా ఈ సినిమాని తీశారు అలానే నిర్మాతలు క్వాలిటీ విషయంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు.  ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి నిర్మాతలకు మంచి లాభాలు తీసుకోని వచ్చి వాళ్ళు ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి అని కోరుకుంటున్నా అని తెలియజేశారు.

ఇక ఆ తర్వాత సెవన్ హిల్స్ సతీష్ మాట్లాడుతూ.. "బాగుంది" సినిమా డైరెక్టర్ రామ్ కుమార్ ఎప్పటి నుంచో మిత్రుడు. ఇప్పటి వరకు చాలా మంచి సినిమాలు తీశారు. ఇక ఇప్పుడు బాగుంది సినిమా సూపర్ హిట్ అయ్యి భవిష్యత్ లో మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను.. అని అన్నారు..

ఇక మరో అతిథి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ... బాగుంది సినిమా దర్శకులు రామ్ కుమార్ కి సూపర్ స్టార్ కృష్ణ గారి తో పని చేసిన అనుభవం ఉంది. చాలా హార్డ్ వర్కర్. డైరెక్టర్ రామ్ కుమార్ "బాగుంది" సినిమా చాలా బాగా తీశారు. టీజర్ చూశాక సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తీసినట్టు అనిపిస్తుంది అని అన్నారు. 

చిత్ర నిర్మాత రాజనేని వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ...  విన్నాను బాగా నచ్చింది. మా సినిమా అన్ని వర్గాల వారికి నచ్చుతుంది.. ఈ చిత్రంపై నాకు ఎటువంటి సందేహాలు లేవు అని తెలియజేశారు. 

చిత్ర దర్శకులు రామ్ కుమార్ మాట్లాడుతూ... "బాగుంది" సినిమా సస్పెన్స్ జానర్ లో తీశాము. సినిమా చూస్తే అంతా థ్రిల్ అవుతారు. నేను ఇప్పటివరకు చేసిన సినిమాలు డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేశాను. బాగుంది సినిమాను కూడా కథ, కథనాలు డిఫరెంట్ గా ఉంటాయి. చూసిన వాళ్ళు ఖచ్చితంగా థ్రిల్ అవుతారు. హీరో కిషోర్ తేజ చాలా బాగా చేశారు.. హీరోయిన్ భవ్యశ్రీ నాతో  చేస్తున్న రెండో సినిమా ఇది. చాలా సపోర్ట్ చేసింది. ఈ సినిమా ద్వారా అందరికీ మంచి పేరు వస్తుందని అన్నారు. 

హీరో కిశోర్ తేజ మాట్లాడుతూ... డైరెక్టర్ రామ్ కుమార్ చెప్పిన దానికంటే సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా ద్వారా మా ఆర్టిస్టులకు టెక్నిషియన్స్ కు మంచి పేరు రావాలని, మా నిర్మాతలకు మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను.. అన్నారు. 

హీరోయిన్ భవ్యశ్రీ మాట్లాడుతూ... డైరెక్టర్ రామ్ కుమార్ తో వర్క్ చేస్తున్న రెండో సినిమా. ఇలాంటి కథ మీరు ఇప్పటివరకు చూసి ఉండరు అందుకే ఈ సినిమా తప్పక చెయ్యాలి అనుకున్నాను. నాకు సహకరించిన కో-ఆర్టిస్ట్ లకు,టెక్నిషియన్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు.

Also Read: Fixed Deposit Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంపు   

Also Read: 7th Pay Commission: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్.. భారీగా జీతాలు పెంపు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News