Hema: మీడియాపై గుర్రుగా నటి హేమ.. వీళ్లకు చెప్పాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యలు.. వీడియో వైరల్..

Bengaluru rave party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కోర్టు ఇప్పటికే నటి హేమకు బెయిల్ మంజారు చేసింది. ఈ క్రమంలో ఆమె కాసేపటి క్రితం విడుదలయ్యారు. 

Last Updated : Jun 14, 2024, 06:34 PM IST
  • జైలు నుంచి విడుదలైన నటి హేమ..
  • మీడియా వాళ్ల మీద ఫైర్..
Hema: మీడియాపై గుర్రుగా నటి హేమ.. వీళ్లకు చెప్పాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యలు.. వీడియో వైరల్..

Actress hema in bengaluru rave party case: బెంగళూర్ రేవ్ పార్టీ కేసులో నటి హేమకు బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో నటి హేమ కాసేపటి క్రితమే జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హేమ తరపు లాయర్ లో కోర్టు ఆర్డర్ కాపీని తీసుకుని జైలు అధికారులకు అందజేశారు. అదే విధంగా జైలు అధికారుల ఫార్మాలీటిస్ అన్ని పూర్తిచేసుకున్నాక.. హేమ బైటకు వచ్చారు. అక్కడ నటి హేమ కోసం కొందరు మీడియా వాళ్లు ఏంమాట్లాడుతుందో అని ఆసక్తిగా ఎదురు చూశారు.

 

అంతేకాకుండా.. హేమ లాయర్ కూడా మీడియాతో మాట్లాడకుండా వెళ్తే బాగుండదంటూ కన్నడలో మాట్లాడారు. దీనికి నటిహేమ.. వీళ్లకు చెప్పాల్సిన అవసరమేముంది అంటూ కాస్త సెటైరిక్ గా మాట్లాడారు. ఈ క్రమంలో నటి హేమ మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. నటి హేమ బెంగళూరు డ్రగ్స్ కేసులో అడ్డంబు బుక్కైంది. రేవ్ పార్టీలో పాల్గొన్న 103 మందికి టెస్టులు చేయగా.. 86 మందిలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు సీసీబీ పోలీసులు గుర్తించారు. వీరందరికి కూడా నోటీసులు జారీచేశారు. టాలీవుడ్ నుంచి నటి హేమ కు కూడా నోటీసులు జారీ చేశారు. కానీ ఆమె ఒకసారి తన  ఆరోగ్యం బాగాలేదని, మరోసారి పోలీసుల నోటీసులకు ప్రాపర్ గా రెస్పాండ్ కాలేదు.

దీంతో పోలీసులు నేరుగా ఆమె నివాసానికి వెళ్లి మూడోసారి నోటీసులు ఇచ్చి మరీ అరెస్టు చేసి బెంగళూరుకు తరలించారు. ఆ తర్వాత ఆమెకు ఆస్పత్రిలో మెడికల్ చెకప్ లు చేసి, కోర్టులో హజరుపర్చారు. ఆ తర్వాత కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తిగాకాగానే కోర్టు ఆదేశాలతో ఆమెను జైలుకు తరలించారు. ఇక మరోవైపు.. హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ లేవని, ఆమె తరపు లాయర్లు కోర్టులో వాదించారు. అదే విధంగా..  ఆమెపై ఆరోపణలు వచ్చిన పది రోజులకు వైద్య పరీక్షలు చేశారని తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల దగ్గర సాక్షాలు లేవని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు హేమ రేవ్ పార్టీలో పాల్గొన్న ఆధారాలను సీసీబీ న్యాయవాది కోర్టుకు అందించారు.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

ఇక ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ బెంగళూరు కోర్టు మంజూరు చేసింది.  ఇక నటి హేమ మాత్రం మొదటి నుంచి తాను డ్రగ్స్ తీసుకోలేదని  హేమ చెబుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఒకసారి ఫామ్ హౌస్ లో ఉన్నానని చెప్పడం, బిర్యానీ వండటం వంటి పనులతో నటి హేమ ట్రోలింగ్ కు గురయ్యారు. ఇక నటి హేమను మూవీ ఆర్టిస్ట్ అసొసియేషన్ ప్రాథమిక సభ్యత్వం ను రద్దు చేసిన విషయం తెలిసిందే. నటి హేమ కూడా తాను సింహాంలాంటిదాన్నని.. అది ఒక అడుగు వెనక్కు వేస్తే ..పదడుగులు ముందుకు దూకుతుంది.. తాను అలానే.. అంటూ గతంలో మీడియా ముందు రెచ్చిపోయారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News