చిరంజీవి ఇంట్లో దొంగతనం

Last Updated : Nov 7, 2017, 10:56 AM IST
చిరంజీవి ఇంట్లో దొంగతనం

జూబ్లీ హిల్స్ లోని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో రెండులక్షల రూపాయలు చోరీ అయ్యాయి. ప్రాంతీయ మీడియా చానళ్ళు,  వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల మేరకు రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో రెండు లక్షల రూపాయలు చోరీకి గురైంది. ఈ ఘటన జరిగి రెండు రోజులు అయ్యింది. 

చిరంజీవి అసిస్టెంట్ స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు నమోదు చేసాడు. కేసును పరిగణలోకి తీసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కేసులో అనుమానంగా భావిస్తున్న పనిమనిషి చెన్నయ్యను కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజీ లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

సినిమా విషయానికి వస్తే.. చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా పనిలో బాగా బిజీ అయ్యారు. సురేందర్ రెడ్డి ఈ సినిమా దర్శకుడు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ చిత్రానికి నిర్మాత రామ్ చరణ్. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు అమితాబ్, నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ చేయాలని యోచిస్తున్నారు. 

Trending News