The Warriorr OTT: నెల రోజులైనా కాకముందే.. ఓటీటీలోకి రామ్‌ 'ది వారియర్‌'! స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా

Ram Pothineni's The Warriorr Movie arrives on Disney Plus Hotstar Telugu this August 11. జులై 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ది వారియర్‌' సినిమా.. నెల రోజులైనా కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 31, 2022, 02:34 PM IST
  • నెల రోజులైనా కాకముందే
  • ఓటీటీలోకి రామ్‌ 'ది వారియర్‌
  • ఆనందం వ్యక్తం చేస్తున్న ఫాన్స్
The Warriorr OTT: నెల రోజులైనా కాకముందే.. ఓటీటీలోకి రామ్‌ 'ది వారియర్‌'! స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా

Ram Pothinenis The Warriorr Movie arrives on Disney Plus Hotstar: కోలీవుడ్‌ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కించిన సినిమా 'ది వారియర్‌'. ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో హీరో ఆది పినిశెట్టి విలన్‌గా నటించాడు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన వారియర్‌ సినిమా జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన మేర హిట్ కొట్టలేకపోయింది.

జులై 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ది వారియర్‌' సినిమా.. నెల రోజులైనా కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ 'డిస్నీ+ హాట్‌స్టార్‌'లో స్ట్రీమింగ్‌ కానుంది. ఆగస్టు 11 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని హాట్‌స్టార్‌ వీడియో ద్వారా అధికారికంగా వెల్లడించింది. విషయం తెలిసిన సినీ ప్రియులు షాక్ అవుతున్నారు. అప్పుడే ఓటీటీలోకి వస్తుందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వారియర్‌ సినిమాను థియేటర్‌లో చూడటం మిస్‌ అయినవాళ్లు ఎంచక్కా ఇంట్లోనే ఎంజాయ్ చేయనున్నారు. 

'ది వారియర్‌' సినిమాలో సత్య అనే ఐపీసీ అధికారి పాత్రలో రామ్‌ కనిపించాడు. గ్యాంగ్‌స్టర్‌  గురు పాత్రలో ఆది పినిశెట్టి నటించాడు. విజిల్‌ మహాలక్ష్మి పాత్రలో కృతి శెట్టి నటించారు. గురుపై విజయం సాధించేందుకు సత్య ఎలాంటి ఆపరేషన్‌ చేపట్టాడు?, ఆయన ఎదుర్కొన సవాళ్లేంటి?, విజిల్‌ మహాలక్ష్మితో సత్యకి ఉన్న సంబంధమేంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో రామ్‌, ఆది మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి.

Also Read: అప్పుడే ఓటీటీలోకి 'పక్కా కమర్షియల్‌'.. స్ట్రీమింగ్‌ ఎక్కడ, ఎందులోనో తెలుసా?

Also Read: Nikhil: సినిమా రిలీజ్ అవదన్నారు.. జీవితంలో తొలిసారి ఏడ్చానన్న నిఖిల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

 

Trending News