EPFO Pension Schemes: ప్రైవేటు ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్‌.. 58 ఏళ్లు నిండిన వారికి EPFO నుంచి పెన్షన్‌..


EPFO Pension Schemes: ప్రైవేటు ఉద్యోగుల కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)  అద్భుతమైన పథకాలను అందిస్తోంది. ముఖ్యంగా పెన్షన్‌ పథకం ద్వారా  58 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా పెన్షన్‌ పొందవచ్చు. అయితే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

EPFO Pension Schemes: ప్రస్తుతం చాలా మంది ప్రైవేటు ఉద్యోగులు పదవి విరమణ పొందిన తర్వాత EPFO నుంచి వచ్చే పెన్షన్‌ వివరాల గురించి అవగాహన లేకుండా పొయింది. నిజానికి ప్రతి ఉద్యోగి పదవి విరమణ తర్వాత పెన్షన్‌ పొందవచ్చు. అయితే ఇది గతంలో మన జీతం నుంచి కట్ చేసిన PFపై అధారపడి ఉంటుంది. గత 40 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేసి.. 60 సంవత్సరాల  పదవి విరమణ తర్వాత పెన్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. 
 

1 /7

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అందించిన ప్రత్యేకమైన ఆదేశాల కారణంగా.. ప్రతి ఏడాది EPF పెన్షన్‌ దాదాపు 4 శాతం వరకు పెంచుతూ వస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) వివరాల ప్రకారం.. ప్రతి ప్రైవేటు ఉద్యోగి, యాజమన్యం తప్పకుండా పెన్షన్‌ డబ్బులు పెట్టుబడిగా EPFకి చెల్లించాల్సి ఉంటుంది.   

2 /7

EPFO అందించిన ప్రత్యేకమైన నిబంధనల ప్రకారం.. ఏ ఉద్యోగైనా EPFOకి దాదాపు 10 నుంచి 11 సంవత్సరాల పాటు నిరంతరం జీతం నుంచి డబ్బులు చెల్లిస్తేనే పెన్షన్‌కి అర్హులవుతారు. 

3 /7

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ పొందిన తర్వాత 58 సంవత్సరాల వయస్సు నుంచి ఈ పెన్షన్‌ ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ఈ EPFO పెన్షన్‌ అర్హులైన కుటుంబ సభ్యులకు కూడా పెన్షన్‌ అందించే రూల్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఇది కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో మాత్రమే జరుగుతుంది.  

4 /7

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన పెన్షన్‌ పథకాల్లో భాగంగా.. ప్రైవేటు ఉద్యోగాలు చేసి పదవి విరమణ పొందిన వారికి దాదాపు ఇప్పుడు ఏడు రకాల EPFO ​​పెన్షన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో కొన్ని ఈ రోజు తెలుసుకుందాం..

5 /7

చాలా మంది పదవి విరమణ చేసిన వారికి ముందస్తు పెన్షన్‌ గురించి తెలియదు.. ఇది పథకం కింద EPFO దాదాపు 58 ఏళ్లు నిండిన వారికి కూడా పెన్షన్‌ను అందిస్తుంది. అయితే ఈ పెన్షన్‌ను ముందుగా తీసుకునేవారికి ప్రతి ఏడాది పెన్షన్‌ నాలుగు శాతం వరకు తగ్గుకుంటూ వస్తుంది.  

6 /7

ఇక ఇందులోనే సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ రెండవది.. ఇది కూడా EPFO పథకంలో ప్రధానమైనది 58 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్‌ అందిస్తోంది. ఈ పథకం ద్వారా 60 సంవత్సరాల నిండి తర్వాత నుంచి పెన్షన్‌ పొందవచ్చు.

7 /7

ఈ సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ తీసుకునేవారు కూడా EPFO రూల్స్‌లో భాగంగా ప్రతి సంవత్సరం పెన్షన్‌ 4 శాతం వరకు పెరుగుతుంది. అంతేకాకుండా ఈ పథకం మొదటి పెన్షన్‌ స్కీమ్‌ కంటే చాలా బాగుంటుంది.