Thalapathy 66: విజయ్ సినిమాలో రష్మిక.. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

దళపతి విజయ్ కధానాయకుడి గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, పీవీపీ నిర్మాణంలో వైభవంగా భారీ చిత్రం ప్రారంభమైంది. ఇందులో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించనుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 6, 2022, 05:41 PM IST
  • ప్రారంభమైన దళపతి విజయ్ కొత్త సినిమా
  • ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్న వంశీ పైడిపల్లి
  • హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న
Thalapathy 66: విజయ్ సినిమాలో రష్మిక.. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Thalapathy 66: తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ వరుస సినిమాలో బిజీగా ఉన్నారు. బీస్ట్ సినిమా విడుదలకు సిద్ధం అవ్వగా.. తరువాతి సినిమా గురించి కూడా ప్రకటన విడుదల అయింది. ఈ స్టార్ హీరో తరువాత సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించబోతున్నాడు. 

దళపతి విజయ్ కధానాయకుడి గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, పీవీపీ నిర్మాణంలో వైభవంగా భారీ చిత్రం ప్రారంభమైంది. దళపతి విజయ్ కధానాయకుడి గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా భారీ స్థాయిలో చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ రోజు చెన్నైలో పూజా కార్యక్రమాలతో వైభవం గా ప్రారంభమైన ఈ చిత్రం, ఈరోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుటుంది.

ఇక హీరోయిన్ విషయానికి వస్తే.. తమిళ, తెలుగు, కన్నడ భాషలలో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో దళపతి విజయ్ జతకట్టనుంది. ప్రస్తుతం రష్మిక తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ వరుస అవకాశాలను సొంతం చేసుకుంటుంది. పుష్ప సినిమా తరువాత రష్మిక నేషనల్ స్టార్ గా ఎదిగింది. 

విజయ్ 66 వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భారీతారాగణం కనువిందు చేయనుంది. అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పని చేయనున్నారు. సూపర్ ఫామ్‌ లో ఉన్న సెన్సేషనల్ సంగీత దర్శకుడు ఎస్ థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించనున్నారు. ఈ చిత్రం కోసం వంశీ పైడిపల్లి అద్భుతమైన కథని సిద్దం చేశారు.

వంశీ పైడిపల్లి తో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లే ను, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. భారీతారాగణం, అత్యున్నత సాంకేతిక బృందం కలసి పనిచేస్తున్న ఈ చిత్రం దళపతి విజయ్ కెరీర్లో భారీ అంచనాలు వున్న సినిమాగా రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

Also Read: Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి చేసుకున్నాకే.. నేను చేసుకుంటా! హాట్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

Also Read: Stock Markets: మార్కెట్లకు రెండో రోజూ నష్టాలు- కుదిపేసిన ఐటీ, హెచ్​డీఎఫ్​సీ జంట షేర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News