Vijay Devarkonda with Tamil Director: విజయ్ దేవరకొండ కెరీర్ స్టార్ట్ చేసిన అతి తక్కువ టైం లోనే మంచి హీరోగా పేరు తెచ్చుకొని వరుస అవకాశాల్ని చేజిక్కించుకున్నాడు. కానీ అవకాశాలు వచ్చిన కూడా విజయ్ కి హిట్ వచ్చి మాత్రం చాలా కాలం అయిపొయింది. గీత గోవిందం తరువాత విజయ్ చేసిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఆఖరికి విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకొని లైగర్ కూడా ఆయనకి నిరాశ మిగిల్చింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేసిన లైగర్ సినిమా విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిసాస్టర్ గా నిలిచింది. ఇక ఈ మధ్య విడుదలైన ఖుషి సినిమా కేవలం పరవాలేదు అనిపించుకుంది.
ఇదిలా ఉంటే గతం లో విజయ్ దేవరకొండ తమిళంలో లో నోటా అనే సినిమాలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. తమిళ దర్శకుడి అయిన ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయ్ కి హిట్ తిసుకురాలేకపోయింది. ఈ సినిమా తరువాత తమిళ దర్శకులు ఎవరు విజయ్ దేవరకొండ కి కథ చెప్పడానికి ముందుకి రాలేదు. కానీ విజయ్ ఖుషి సినిమా తెలుగులో పరవాలేదు అనిపించకుండా తమిళంలో మాత్రం కలెక్షన్స్ బాగా రాబట్టింది. దీంతో ఇప్పుడు ఫైనల్ గా ఒక దర్శకుడు మన విజయ్ దేవరకొండ కి కథ చెప్పినట్టు తెలుస్తోంది. ఇటివలే దర్శకుడు అరుణ్ మతేశ్వరాన్ విజయ్ కి ఒక కథ చెప్పాడట. విజయ్ దేవరకొండ కూడా అరుణ్ చెప్పిన కథ విని, అతడితో సినిమా చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు అని వినికిడి.
ఇకపోతే అరుణ్ మతేశ్వరాన్ ప్రస్తుతం తమిళం లో తానూ తీస్తున్న కెప్టెన్ మిల్లర్ అనే సినిమా పైనే దృష్టి పెట్టాడు. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా లో తెలుగు హీరో సందీప్ కిషన్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మధ్యనే రిలీజ్ అయిన పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకునింది. మరి నోటా సినిమాతో తమిళ్ లో హిట్ అందుకోలేని విజయ్, మరోసారి తమిళ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చి హిట్ అందుకుంటాడు అని ఆశిద్దాం.
కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ తనకు గీతా గోవిందం లాంటి సూపర్ హిట్ అందించిన పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేస్తోంది.
Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook