Harom Hara Pre Release Business: సుధీర్ బాబు ‘హరోం హర’ మూవీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ డీటెల్స్.. టార్గెట్ మాములు లేదుగా..

Harom Hara Pre Release Business: సూపర్ స్టార్ కృష్ణ అల్లుడుగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు బావగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఈయన సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఈయన ‘హరోం హర’ మూవీతో పలకరించబోతున్నాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 13, 2024, 12:59 PM IST
Harom Hara Pre Release Business: సుధీర్ బాబు ‘హరోం హర’ మూవీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ డీటెల్స్.. టార్గెట్ మాములు లేదుగా..

Harom Hara Pre Release Business: సుధీర్ బాబు హీరోగా జయపాజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు సుధీర్ బాబు. మంచి టాలెంటెడ్ నటుడిగా పేరు తెచ్చుకున్న ఇప్పటికీ హీరోగా సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి. ఇప్పటికీ మావయ్య, బావ మహేష్ బాబు ఇమేజ్ ను నమ్ముకొనే బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాడు సుధీర్ బాబు. ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో ‘హరోం హర’ మూవీతో పలకరించబోతున్నాడు. ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కలిపి దాదాపు 450 పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా 600 స్క్రీన్స్ లో ఈ సినిమా విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ కలిపి దాదాపు రూ. 5 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా మరో కోటి వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ. 6.5 కోట్ల వరకు రాబట్టాలి. పూర్తి ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్ మూవీగా రాబోతున్న ఈ సినిమాకు టాక్ బాగుంటే సినిమాకు కలెక్షన్స్ రావడం పెద్ద విషయమేమి కాదు. పైగా ఈ సినిమాలో సుధీర్ యాస, భాష డిఫరెంట్ గా ఉంది.  మరోవైపు ప్రభాస్ ‘కల్కి 2898 AD’ రిలీజ్ వరకు ప్రేక్షకులకు మరో ఆప్షన్ కూడా లేదు.

సుధీర్ బాబు విషయానికొస్తే..నాగ చైతన్య, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన ‘ఏమాయ చేసావే’ సినిమాలో చిన్న రోల్లో సినీ రంగ ప్రవేశం చేసాడు. ఆ తర్వాత ‘శివ మనసులో శృతి’ సినిమాతో హీరోగా పరిచయ్యాడు. ఆ తర్వాత ‘ప్రేమ కథా చిత్రమ్’ మూవీతో హీరోగా బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత హీరోగా పలు చిత్రాల్లో నటించిన పెద్దగా ఉపయోగపడింది లేదు. తాజాగా ఇపుడు ‘హరోం హర’ మూవీతో పలకరించబోతున్నాడు. మరి ‘హరోం హర’ మూవీతో సుధీర్ బాబు పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News