Trivikram Srinivas : త్రివిక్రమ్ తో రామ్ సినిమా.. తీవ్రంగా ప్రయత్నిస్తున్న నిర్మాత

Sravanthi Ravi Kishore: నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. కాగా డైలాగ్ రైటర్ గా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ని నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడుగా మనకు పరిచయం చేసింది మాత్రం స్రవంతి రవి కిషోర్. అందుకే స్రవంతి రవి కిషోర్ అంటే త్రివిక్రమ్ కి ఎనలేని ప్రేమ.‌ మరి అలాంటి ఆ నిర్మాత త్రివిక్రమ్ అలానే తన తమ్ముడి కడుకు రామ్ తో సినిమా చేయాలని తలుస్తున్నారు..

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 8, 2023, 12:01 PM IST
Trivikram Srinivas : త్రివిక్రమ్ తో రామ్ సినిమా.. తీవ్రంగా ప్రయత్నిస్తున్న నిర్మాత

Ram Pothineni: తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లు అంటే మనకు తప్పక గుర్తొచ్చే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. డైలాగ్ రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ తరువాత నువ్వే నువ్వే సినిమాతో డైరెక్టర్ గా మారాడు. తరుణ్ హీరోగా.. శ్రియ హీరోయిన్ గా.. ప్రకాష్ రాజు ముఖ్య పాత్రలో వచ్చిన ఈ సినిమాని స్రవంతి రవి కిషోర్ నిర్మించారు. అనగా త్రివిక్రమ్ ని తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయం చేసింది నిర్మాత స్రవంతి రవి కిషోర్.

కాగా ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ను దర్శకుడిగా నిలబెట్టింది ఈ చిత్రమే. ఆ తరువాత మరిన్ని సూపర్ హిట్ సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు త్రివిక్రమ్. అయితే తనకు తొలి అవకాశం ఇచ్చిన స్రవంతి రవి కిషోర్ కి త్రివిక్రమ్ ఎంతో కృతజ్ఞతా భావంతో ఉంటారు. 
ఇప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ అలానే స్రవంతి రవికిషోర్ మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారట. అంతెందుకు ఒక ఈవెంట్లో రవికిషోర్ కాళ్లకు మొక్కారు త్రివిక్రమ్ శ్రీనివాస్. దీన్నిబట్టే త్రివిక్రమ్ శ్రీనివాస్ కి స్రవంతి రవి కిషోర్ అంటే ఎంత గౌరవమో అలానే ఎంత అభిమానమో అర్థం చేసుకోవచ్చు.

మాటల రచయితగా కూడా స్రవంతి రవి కిషోర్ బ్యానర్ లో ఎన్నో సినిమాలు చేశారు త్రివిక్రమ్. కాగా స్రవంతి రవి కిషోర్ మరెవరో కాదు మన హీరో రామ్ కి పెద నాన్న అన్న విషయం మనకు తెలిసిందే. అయితే స్రవంతి రవి కిషోర్ కు తన తమ్ముడి కొడుకు  రామ్ పోతినేనితో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని ఎన్నో రోజుల నుంచి కోరిక ఉందట. ఆ కోరిక కచ్చితంగా తీర్చుకుంటానని అంటున్నారు రవికిశోర్.

ప్రస్తుతం శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన కొత్త సినిమా ‘దీపావళి’. ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించారు. నెల 11న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడారు. తన దీపావళి సినిమా గురించి మాట్లాడిన తరువాత రవి కిషోర్ రామ్ గురించి మాట్లాడుతూ రామ్ హీరోగా ఒక సినిమా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇక రామ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా గురించి చెబుతూ ‘మేం కలిసి మంచి సినిమాలు చేశాం. మా మధ్య మంచి అనుబంధం ఉంది. రామ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని నాకు కోరిక ఉంది. ముందు తన కమిట్మెంట్స్ ఏం ఉన్నాయో త్రివిక్రమ్ చూసుకోవాలి. ఆ తరువాత రామ్ హీరోగా చేస్తే ఈ స్క్రిప్ట్ బాగుంటుందని అతను అనుకోవాలి’ అని చెప్పారు.

మొత్తానికి ఈ మాటలు విన్న చాలా మంది స్రవంతి రవి కిషోర్ రామ్.. త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాలని తెగ ప్రయత్నిస్తున్నారు అని కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ది వారియర్.. అలానే స్కంద సినిమాలతో కేవలం యవరేజ్ హిట్లు అందుకున్నారు రామ్. ఈ నేపథ్యంలో రామ్ కి కూడా ఒక సరైన సూపర్ హిట్ రావడం ఎంతో అవసరం. మరి అలాంటి సూపర్ హిట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తుంది అని రామ్ అభిమానులు అభిప్రాయపరుతున్నారు. రవి కిషోర్ అడిగితే త్రివిక్రమ్ ఒప్పుకోక మానరు. కాబట్టి ఎలా అయినా రవి కిషోర్.. త్రివిక్రమ్ సినిమా సెట్ చేస్తారు అని ఆ సినిమా రామ్ కి సూపర్ హిట్ ఇస్తుంది అని ఖుషి అవుతున్నారు అభిమానులు.

Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…

Also Read: Redmi 13C Price: అదిరిపోయే ఫీచర్స్‌తో డెడ్‌ చీప్‌ ధరతో మార్కెట్‌లోకి Redmi 13C మొబైల్‌..స్పెసిఫికేషన్స్‌ ఇవే..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News