Sonu Sood: టాలీవుడ్ మేనేజర్ కుమారుడి ఆపరేషన్ కు సోనూ సూద్ సాయం

కలియుగ కర్ణుడు సోనూసూద్ ( Sonu Sood ) మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. 

Last Updated : Oct 5, 2020, 06:44 PM IST
    • కలియుగ కర్ణుడు సోనూసూద్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు.
    • కరోనావైరస్ సంక్రమణ ను నిర్మూలించడానికి భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ఇబ్బంది పడ్డ వేలాది మంది వలస కూలీలకు సాయం చేసి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించాడు సోనూ సూద్.
Sonu Sood: టాలీవుడ్ మేనేజర్ కుమారుడి ఆపరేషన్ కు సోనూ సూద్ సాయం

సోనూసూద్ ( Sonu Sood ) మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ ను నిర్మూలించడానికి భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ఇబ్బంది పడ్డ వేలాది మంది వలస కూలీలకు సాయం చేసి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించాడు సోనూ సూద్.

అదే సమయంలో విద్యార్థులకు కూడా తగిన విధంగా సాయం చేసి గురువుగా మార్గదర్శనం చేశాడు. దాంతో పాటు ట్విట్టర్ లో ఎంతో మంది సాయం కోరగా వారికి వెంటనే సాయం అందించి కలియుగ కర్ణుడిగా మారాడు.

ALSO READ| Cricketers Talent: మన క్రికెటర్లు క్రికెటర్స్ కాకపోయి ఉంటే ఏం చేసేవాళ్లో తెలుసా?
అదే కోవలో ఇటీవలే ఒక తెలుగు సినీ పరిశ్రమ మేనేజర్ కు సాయం చేశాడు సోనూ. తన పిల్లాడికి హార్ట్ ప్రాబ్లమ్ ఉంది అని సుబ్బారావు అనే వ్యక్తి ట్వీట్ చేసి సాయం కోరాగా...వెంటనే స్పందించిన సోనూ ఆపరేషన్ కు ఏర్పాట్లు చేశానన్నాడు. 

ఆ ట్వీట్ లో...

సోనూసూద్ గారు, నా పేరు ఎంవి సుబ్బరావు ( తెలుగు సినిమా మేనేజర్ ). నా కుమారుడికి హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. నా దగ్గర డబ్బు లేదు సార్.. దయచేసి సాయం చేయండి. నా పిల్లాడిని కాపాడండి అని ట్వీట్ చేశాడు సుబ్బారావు.

ALSO READ| Happy Life: సంతోషంగా ఉండాలంటే ఇలా చేసి చూడండి

ఆ ట్వీట్ కు రిప్లై ఇచ్చిన సోనూ సూద్

పని అయిపోయింది.

బుధవారం మీ పిల్లాడికి చెకప్ ఉంటుంది. 

గురువారం ముంబైలోని SRCC ఆసుపత్రిలో చికిత్స చేయిస్తాడు.

గాడ్ బ్లెస్ యూ అని ట్వీట్ చేశాడు. 

కాగా సోనూసూద్య మంచి మనసును అందరూ తెగ పొగిడేస్తున్నారు. ఇటీవలే ఐక్యరాజ్య సమితి సోనూసూద్ కు అవార్డు కూడా అందించిన విషయం తెలిసిందే.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News