Tiger 3: ముగ్గురు సూపర్ స్టార్లు ఒకేసారి…దద్దరిల్లిపోనున్న థియేటర్స్

Salman Khan: ప్రస్తుతం ఒక హీరో సినిమా కోసం మరో హీరో సహాయం చేయడం అనేది సాధారణం అయిపోతోంది. ఈమధ్య జైలర్ సినిమాలో కూడా రజినీకాంత్ తో పాటు శివరాజ్ కుమార్ అలానే మోహన్ లాల్ కనిపించి ఆ సినిమా రేంజ్ ని పెంచేశారు. ఇప్పుడు ఇలానే సల్మాన్ ఖాన్ సినిమాలో మరో ఇద్దరు సూపర్ స్టార్లు కనిపించి అల్లరించనున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2023, 11:19 AM IST
Tiger 3: ముగ్గురు సూపర్ స్టార్లు ఒకేసారి…దద్దరిల్లిపోనున్న థియేటర్స్

YRF Spy universe: ముగ్గురు పాపులర్ హీరోలు ఒకేసారి స్క్రీన్ పైన కనిపిస్తే ఇక అభిమానుల హడావిడి చెప్పాలా? ఒకప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు విపరీతంగా వచ్చేవి. ఆ తరువాత ఆ ట్రెండ్ అనేది చాలా రోజులు మరుగున పడిపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ ఒక హీరో సినిమాలో మరొక హీరో కనిపించడం సాధారణమైపోయింది. దీనికి తోడు ప్రస్తుతం సినిమాటికి యూనివర్స్ లు కూడా మన ఇండియాలో పాపులర్ అవుతున్నాయి.

సౌత్ ఇండియాలో లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ ఎంతగా పేరు తెచ్చుకునిందో నార్త్ ఇండియాలో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ కి అంత పేరు ఉంది. ఇక ఈ యూనివర్స్ లో భాగంగా వచ్చిన షారుక్ ఖాన్ పఠాన్ లో షారుఖ్ ఖాన్ తో పాటు సల్మాన్ ఖాన్ కేవలం కాసేపు కనిపించినందుకే.. అప్పట్లో ఆ సీన్ సెన్సేషన్ సృష్టించింది. నార్త్ సైడ్ థియేటర్లు మోతెక్కిపోయాయి. ఆ సినిమా సక్సెస్ లో ఈ ఎపిసోడ్ షేర్ ని తక్కువ చేసి చెప్పలేం. 

ఇక అలా షారుఖ్ ఖాన్ సినిమా సక్సెస్ లో భాగమైపోయారు సల్మాన్ ఖాన్. కాగా ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమా సక్సెస్ కోసం షారుక్ అలానే మరొక హీరో కూడా సహాయం చేయాలి అనుకుంటున్నారట. ప్రస్తుతం వైఆర్ఎఫ్ స్పై సిరీస్ లో వస్తోన్న మరో సినిమా టైగర్ 3. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ స్పెషల్ క్యామియో చేస్తున్న సంగతి అల్రెడీ లీకైపోయింది. టెర్రిఫిక్ అనిపించే ఒక యాక్షన్ ఛేజ్ లో మరోసారి మన సల్మాన్ ఖాన్ అలానే షారుఖ్ ఖాన్ ఇరగదీయ్యడానికి సిద్ధమైపోయారట. ఈ సీన్ లో ఇద్దరు కలిసి బైకు మీద వెళుతూ ఆ తర్వాత రకరకాల విన్యాసాలతో విలన్ ఇమ్రాన్ ఆష్మి గ్యాంగ్ కి ముచ్చెమటలు పట్టిస్తారట. ఈ వార్త బయటకి వచ్చిన దగ్గర నుంచి ప్రేక్షకులు ఈ సీన్ కోసం తెగ ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సీన్ కే థియేటర్స్ దద్దరిల్లుతాయి అని అందరూ అనుకుంటుంటే ఇప్పుడు మరో హీరో కూడా ఈ చిత్రంలో భాగం కావడం ఫాన్స్ ని మరింత ఖుషి చేస్తోంది. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ కాకుండా ఇప్పుడు ఈ సినిమాలో హృతిక్ రోషన్ కూడా భాగం కానున్నారట. టైగర్ 3లో అతను ఉండటం కన్ఫర్మ్ అని ముంబై మీడియా టాక్. 

కాగా ఈ పాత్ర ఎక్కువ సేపు కాకపోయినా..తాను వచ్చే కాసేపు మాత్రం ప్రేక్షకులకు పూనకం రావడం ఖాయం అని తెలుస్తోంది. హృతిక్ వైఆర్ఎఫ్ స్పై సిరీస్ లో భాగంగా నటించిన చిత్రం వార్. ఇప్పుడు టైగర్ జిందా హై, వార్, పఠాన్ లను కలుపుతూ స్పై యూనివర్స్ సృష్టిస్తున్న యష్ రాజ్ సంస్థ అందులో భాగంగానే ఈ ముగ్గురిని కలిపి టైగర్ 3 లో ఒకేసారి చూపించబోతున్నారు. 

ఇక మన తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా హృతిక్ రోషన్ తో చేస్తున్న వార్ 2 రిలీజయ్యాక ఈ బ్యాచ్ లో తోడవుతాడు. నెక్స్ట్ వచ్చే సిరీస్ లో తననీ చూడొచ్చు. మొత్తానికి ఇలా ఒక్కో సూపర్ స్టార్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో కలుస్తూ ఉండడంతో…ఈ యూనివర్స్ నుంచి తదుపరి రాబోయే సినిమాలపై మరింత అంచనాలు పెరుగుతున్నాయి.

ఇక వీటికన్నా ముందు ప్రస్తుతం రాబోతున్న టైగర్ 3 పైన అంచనాలు భారీగా పెరిగాయి. మొత్తానికి ముగ్గురు సూపర్ స్టార్ లు అయినా షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లను ఒకేసారి స్క్రీన్ పైన చూస్తే ఇక హిందీ అభిమానుల రచ్చ ఏ రేంజ్ లో ఉంటుంది అనేది మనం ముందుగానే ఊహించుకోవచ్చు. కాగా టైగర్ 3 అన్ని భాషలలోనూ నవంబర్ 12న విడుదల కాబోతోంది.

Also read: Balineni Issue: ప్రకాశం జిల్లాలో సంక్షోభం సమసినట్టేనా, సీఎం జగన్‌తో బాలినేని భేటీ

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News