Murali Mohan:ఎఫ్‌టీపీసీ ఇండియా, తెలుగు సినిమా వేదిక ఆధ్వర్యంలో మురళీ మోహన్‌కు ఘన సత్కారం..

Murali Mohan: టాలీవుడ్ సీనియర్ నటులు మురళీ మోమన్ చిత్రసీమలో అడుగుపెట్టి 50 యేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు తెలుగు సినిమా వేదిక ఘనంగా సత్కరించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 19, 2024, 07:20 PM IST
Murali Mohan:ఎఫ్‌టీపీసీ ఇండియా, తెలుగు సినిమా వేదిక ఆధ్వర్యంలో మురళీ మోహన్‌కు ఘన సత్కారం..

Murali Mohan: ఏజ్ 83 యేళ్లు అయిన ఇప్పటికీ యంగ్ ఎనర్జిటిక్‌గా ఉంటున్న నటుల్లో మురళీ మోహన్ ఒకరు. తాజాగా ఈయన నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో 50 యేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. మురళీ మోహన్ అంటే యాక్టర్.. ప్రొడ్యూసర్.. రియల్టర్.. బిజినెస్ మెన్.. పొలిటీషియన్.. ఇవీన్న కలిపితే మురళీ మోహన్.. 70 మరియు 80లలో మురళీ మోహన్ హీరోగా నటించిన సినిమాలు చాలానే వచ్చాయ్.. శోభన్ బాబు తర్వాత అంత లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మురళీ మోహన్ సొంతం. నటుడిగా 50 యేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా  ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా మరియు తెలుగు సినిమా వేదిక సంస్థలు ఘనంగా సత్కరించాయి. సంస్థ అధ్యక్ష కార్యదర్సులు చైతన్య జంగా, వీస్ విజయ్ వర్మ పాకలపాటి, నిర్మాతల మండలి అధ్యక్షులు దామోదర ప్రసాద్, సెక్రటరీ ప్రసన్న కుమార్, వ్యాపార వేత్త కోగంటి సత్యం మరియు 20 మంది యువ కథానాయకుల సమక్షంలో వేద పండితుల మంత్రాచ్చోరణాల మధ్య మురళి మోహన్ ని ఘనంగా సత్కరించారు.

ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మురళి మోహన్ మాట్లాడుతూ...
అట్లూరి పూర్ణచంధ్రరావు గారి చేతుల మీదుగా 33 వ ఏట కళామతల్లి ఆశీస్సులు పొందిన తాను నటునిగా, వ్యాపార వేత్తగా విజయవంతంగా రాణించాను.  ఈ క్రమంలో తనకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఇదే వేదికపై ఇటీవల జరిగిన ఎన్నికలలో వీరశంకర్ అధ్యక్షునిగా విజయం సాధించిన తెలుగు దర్శకుల సంఘం కార్యవర్గాన్ని మరియు శుభోదయం సుబ్బారావు నేతృత్వంలో విజయం సాధించిన తెలంగాణ మూవీ టెలివిజన్ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్స్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని మురళి మోహన్ సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

నిర్మాతల మండలి అధ్యక్ష కార్యదర్శులు దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్, ఉపాధ్యక్షులు వశిష్ఠ, తెలంగాణ ఆర్టిస్ట్స్ యూనియన్ అధ్యక్షులు రాజశేఖర్ తదితరులు మురళీ మోహన్ గొప్పతనాన్ని ఆయన ఔనత్యాన్ని కొనియాడారు. స్వర్ణోత్సవ వేళ ఓ గొప్ప నటుడ్ని సత్కరించుకొనే అవకాశం రావడం సంతోషకరం అన్నారు. ఈ సందర్బంగా  చైతన్య జంగా, విజయ్ వర్మ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రామ్ రావిపల్లి అందించిన ప్రశంసా పత్రం, మిమిక్రి రమేష్ చేసిన ఎంటర్టైన్మెంట్ సభికులను ఎంతగానో ఆకట్టుకొంది.అటు జర్నలిస్టులు ధీరజ్ అప్పాజీ , కూనిరెడ్డి శ్రీనివాస్ లను మురళి మోహన్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముంబై నుండి విచ్చేసిన నటీమణులు దని బోస్, అనీషా ముఖర్జీ, రోజా భారతి, సౌమ్య జాను, ముంతాజ్ తదితర వర్ధమాన నటీమణులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు

Also Read: TamiliSai: "బాధగా ఉంది.. కానీ తప్పడం లేదు": రాజ్‌భవన్‌ ఖాళీ చేసిన తమిళిసై

Also Read: Kavitha: కవిత అరెస్ట్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. ఘాటెక్కిన రాజకీయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News