Sankranthi ki Vastunnam Box Office Records: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 14వ తేదీన విడుదలై నాలుగు రోజుల్లోనే రూ.131 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కుటుంబ ప్రేక్షకుల ప్రాధాన్యతతో కలెక్షన్లు రోజురోజుకు పెరుగుతున్నాయి.
ఈ సినిమా విడుదలకు ముందు వెంకటేష్ సినిమాలు.. రూ.25 కోట్ల షేర్‌ను మించకపోవడం ఆనవాయితీగా ఉండేది. అయితే ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.56 కోట్ల షేర్ సాధించి వెంకటేష్ కెరీర్‌లోనే అత్యంత పెద్ద రికార్డును నెలకొల్పింది.
విశ్లేషకుల అంచనా ప్రకారం, మొదటి వారంలోనే ఈ సినిమా రూ.100 కోట్ల షేర్ సాధించే అవకాశముంది. థియేటర్లలో మంచి రన్ కొనసాగితే, లాంగ్ రన్‌లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.120-130 కోట్ల షేర్ కలెక్ట్ చేయగలదని అంటున్నారు.
ఇప్పటికే సలార్, దేవర వంటి సినిమాలు రూ.125 కోట్ల షేర్ సాధించాయి. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా సాఫల్యం చూస్తుంటే.. ఆ రెండు సినిమాలను దాటేసి ఏకంగా.. పుష్ప2, ఆర్ఆర్ఆర్ లాంటి రికార్డులను కూడా.. కొన్ని చోట్ల బద్దలు కొట్టగలదని భావిస్తున్నారు.
ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం కుటుంబ ప్రేక్షకులపై దృష్టిపెట్టడమే. వినోదంతోపాటు భావోద్వేగాలను అద్భుతంగా కలగలిపిన ఈ సినిమా, ప్రేక్షకులకు ఈ సంక్రాంతికి మంచి నవ్వుల విందు అందించింది. ఇక దీంతో మొదటి రోజు నుంచే నెగిటివ్ టాప్ తెచ్చుకున్న.. రామ్ చరణ్ గేమ్ చేంజెర్.. సినిమా అయితే ఏకంగా బాక్స్ ఆఫీస్ దగ్గర పూర్తిగా బోల్తాపడాల్సి వచ్చింది. మరోపక్క శఈ చిత్రం విజయంతో బాలకృష్ణ నటించిన డాకూ మహారాజ్ సినిమా కూడా టాక్ బాగున్నప్పటికీ.. నైజాంలో థియేటర్ల సంఖ్య తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇలా రెండు సినిమాలను అధిగమించి ఈ చిత్రం దూసుకుపోతోంది.
కాగా వెంకటేష్ ఈ సినిమా ద్వారా తన మార్కెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి పండుగను మరింత ప్రత్యేకంగా మార్చింది. అభిమానుల అంచనాలను చేరుకోవడంతో పాటు, రికార్డులను తిరగరాయడంలో ముందంజులో నిలిచింది ఈ చిత్రం.
Also Read: YS Sharmila: 'సూపర్ సిక్స్ ఇవ్వలేక.. ఆడలేక మద్దెల దరువన్నట్టు చంద్రబాబు తీరు'
Also Read: Muppa Raja: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 'సస్పెండ్ ద లీడర్'.. ముప్పా రాజాపై వేటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.