Samantha Ruth Prabhu at nainital సమంత ప్రస్తుతం తన సినిమా షూటింగ్‌లను పూర్తి చేయాలని ఫిక్స్ అయింది. మయోసైటిస్ కారణంగా వాయిదా పడ్డ సినిమాలు, మూలన పడ్డ సినిమా షూటింగ్‌లను ముందుగా పూర్తి చేయాలని అనుకుంటోంది. రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్లో ముందుగా సమంత పాల్గొంది. ఇప్పుడు నైనిటాల్లో సమంత ఉంది. యాక్షన్ సీక్వెన్స్‌లను షూట్ చేసేందుకు సమంత రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది.
నైనిటాల్లో సమంత ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్‌లు చేసేందుకు సమంత ప్రాక్టీస్ చేస్తోంది. ఫ్యామిలీ మెన్ సీజన్ 2లో సమంతకు యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన యానిక్ బెన్‌తో కలిసి ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తోంది. నాకు ఇష్టమైన వ్యక్తి అంటూ.. ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలో సమంత వర్కౌట్లు చేస్తోంది. ఇక అర్దరాత్రి కూడా సమంత ఇలా వర్కౌట్లు చేస్తూ బిజీగా ఉంది.
సమంత ఈ షెడ్యూల్ పూర్తయ్యాక.. విజయ్ సినిమా కోసం రెడీ అవుతుందని తెలుస్తోంది. అసలే సమంతకు మయోసైటిస్ రావడంతో ఖుషి సినిమా మూలకు పడింది. గత ఏడాది ఆగస్ట్‌లో సమంత మంచానికి పరిమితమైంది. అంతకు ముందు కాశ్మీర్లో లాంగ్ షెడ్యూల్‌ను సమంత కంప్లీట్ చేసింది. విజయ్ సమంత ఇద్దరి మీద శివ నిర్వాణ కాశ్మీర్ షెడ్యూల్‌ను పూర్తి చేశాడు.
ఇక సమంత ఇప్పుడు రెట్టింపు సామర్థ్యం, బలం, శక్తితో తిరిగి వచ్చింది. మయోసైటిస్ కారణంగా ఆరేడు నెలలు ఇంటికే పరిమితమైంది. సోషల్ మీడియాకు పూర్తిగా దూరమైంది. ఒక్క పోస్ట్ కూడా చేయకుండా ఉండిపోయింది. అయితే సమంత తన యశోద సినిమా కోసం బయటకు రావాల్సి వచ్చింది. సుమతో ఒక ఇంటర్వ్యూ చేసింది. శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ కోసం బయటకు వచ్చింది. అలా సమంత మెల్లిమెల్లిగా కోలుకుంటోందని అందరికీ అర్థమైంది.
సమంత ఇప్పుడు చేస్తోన్న వర్కౌట్లు, గుడి మెట్లు ఎక్కడం, మొక్కులు తీర్చుకోవడం చూస్తుంటే మయోసైటిస్ పూర్తిగా తగ్గినట్టు తెలుస్తోంది. ఇక సమంత వరుసగా సినిమాలు చేయబోతోన్నట్టుగా తెలుస్తోంది. పుష్ప ది రూల్ సినిమా ఆఫర్‌ను సైతం సమంత పక్కన పెట్టేసినట్టు టాక్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook